ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థల్లో ఒకటైన బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) తెలుగు వార్తా రంగంలోకి అడుగుపెడుతోంది. తన న్యూస్ నెట్ వర్కు సర్వీసులను భారీగా విస్తరిస్తున్న బీబీసీ అందులో భాగంగా తెలుగులో అడుగుపెడుతోంది. ఇప్పటివరకు ఉన్న సర్వీసుల్లోనే కాకుండా మరి 11 భాషల్లో తన న్యూస్ సర్వీసులను వచ్చే ఏడాది ప్రారంభించనుంది.
ఇప్పటికే బిబిసి తమిళ్ - ఉర్దూ - హిందీ భాష ల్లో సర్వీసులను అందిస్తోంది. వచ్చే ఏడాది మరాఠీ - తెలుగు - గుజరాతీ - పంజాబీ భాషల్లో తమ సర్వీసులను ప్రారంభించనున్నట్లు బిబిసి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆఫ్రికా భాషలైన అఫాన్ ఓరామా - అమ్హారిక్ - ఇగ్బో - కొరియన్ - పిడ్గిన్ - తిగ్రిన్యా - యోరుబా భాషల్లో కూడా తమ సేవలను విస్తరిస్తున్నట్టు కూడా బిబిసి ప్రకటించింది. బ్రిటన్ వెలుపల అతి పెద్ద బ్యూరోను ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తెలిపింది.
త్వరలో జరగనున్న విస్తరణతో 2022 నాటికి 50 కోట్ల మంది ప్రజలకు ప్రసారాలు చేరువ కావాలన్నదే బిబిసి లక్ష్యమని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం వారానికి 24.9 కోట్ల మంది ప్రజలకు సమాచారాన్ని బిబిసి చేరవేస్తోంది. కొత్త భాషల్లో ప్రసారాల కోసం బిబిసి సుమారు 289 మిలియన్ పౌండ్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది. 2017 జవనరిలో తెలుగు వెబ్ సైట్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/