రోహిత్ దళితుడు కాదు బీసీ అని తేల్చేశారు

Update: 2017-02-15 04:25 GMT
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం దేశం మొత్తాన్ని ఎంతలా కదిలించిందో తెలిసిందే. అతగాడి సూసైడ్ మోడీ సర్కారు మెడకు చుట్టుకోవటమే కాదు.. తీవ్ర విమర్శల్నిఎదుర్కొనేలా చేసింది. ఇదిలా ఉంటే.. మరణించిన రోహిత్ వేముల దళితుడు ఎంతమాత్రం కాదని.. బీసీ అన్న వాదన వినిపించింది. విపక్షాలు చెబుతున్నట్లుగా ఆయన దళిత విద్యార్థి కాదంటూ బీజేపీ నేతలు తరచూచెప్పేవారు.

రోహిత్ వేముల కులధ్రువీకరణ కోసం విచారించిన కమిటీ తన నివేదికనుసిద్ధం చేసి.. తెలంగాణ రాష్ట్ర సర్కారుకు అందించింది. ఈ నివేదికలో రోహిత్ దళితుడు ఎంతమాత్రం కాదని.. అతడి తండ్రి వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారిగా నిర్దారించింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రోహిత్ వేముల సామాజిక వర్గాన్ని తేల్చేసినట్లుగా తెలుస్తోంది.

కమిటీ ఇచ్చిననివేదిక ఆధారంగా రోహిత్ తల్లి రాధికకు కలెక్టర్ షోకాజ్ నోటీస్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ‘మీరు ఎస్సీ అని నిరూపించుకోండి’ అంటూ కొద్దిపాటి గడువును రాధికకు ఇస్తూ షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. రోహిత్ వేముల తండ్రి వడ్డెర కులానికి చెందిన వ్యక్తి కావటంతో అతడు బీసీ అవుతారని.. కానీ.. రోహిత్ తల్లి రాధిక.. ఆ విషయాన్నికప్పిపెట్టి ఎస్సీ కులధ్రువీకరణ పత్రాన్ని పొందినట్లుగా కమిటీ నిర్దారించింది. మరీ.. తాజాగా వ్యవహారం రానున్న రోజుల్లో మరెంత రచ్చగా మారుతుందో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News