డోప్ టెస్టులో యూసుఫ్ పై 5నెల‌ల బ్యాన్!

Update: 2018-01-09 13:12 GMT
బ‌రోడా బాంబ‌ర్...టీమిండియా మాజీ ఆల్ రౌండ‌ర్ యూసుఫ్ ప‌ఠాన్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఈ డ్యాషింగ్ బ్యాట్స్ మన్ పై 5 నెల‌ల పాటు నిషేధం విధించింది. గ‌త ఏడాది `వాడా` నిర్వ‌హించిన డోప్ టెస్టులో యూసుఫ్....ద‌గ్గు మందులో క‌లిపి ఉండే నిషేధిత ఉత్ప్రేర‌కం టెర్బుట‌లిన్ ను తీసుకున్న‌ట్లు తేలింది. దీంతో, అత‌డిపై నిబంధ‌న‌ల ప్ర‌కారం బీసీసీఐ చ‌ర్య‌లు తీసుకుంది. అయితే, తాను ఉద్దేశ‌పూర్వ‌కంగా ఈ ఉత్ప్రేర‌కాన్ని తీసుకోలేద‌ని యూసుఫ్ ఇచ్చిన వివ‌ర‌ణ‌తో  బీసీసీఐ సంతృప్తి చెందింది. దీంతో, ఈ ఏడాది జ‌ర‌గ‌బోతున్న ఐపీఎల్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ర‌పున యూసుఫ్ బ‌రిలోకి దిగేందుకు మార్గం సుగ‌మ‌మైంది.

గ‌త ఏడాది మార్చి 16న‌ జ‌రిగిన  ఓ టీ20 మ్యాచ్ సంద‌ర్భంగా బీసీసీఐ నిర్వ‌హించిన యాంటీ డోపింగ్ కార్య‌క్ర‌మంలో భాగంగా యూసుఫ్ ప‌ఠాన్ మూత్రం శాంపిల్ ను వాడా సేక‌రించింది. ఆ శాంపిల్ లో కాఫ్ సిర‌ప్ ల‌లో ఉండే నిషేధిత ఉత్ప్రేర‌కం టెర్బుట‌లిన్ ఉన్న‌ట్లు వాడా అధికారులు గుర్తించారు. అయితే, త‌న‌కు డాక్ట‌ర్ సూచించిన కాఫ్ సిర‌ఫ్ లో ఎటువంటి నిషేధిత ఉత్ప్రేర‌కం లేద‌ని - దానికి బ‌దులుగా పొర‌పాటున‌ టెర్బుట‌లిన్ ఉన్న కాఫ్ సిర‌ప్ ను త‌న‌కు ఇవ్వ‌డంతోనే ఈ విధంగా జ‌రిగింద‌ని యూసుఫ్ బీసీసీఐ - వాడా అధికారుల‌కు వివ‌ర‌ణ ఇచ్చాడు. అత‌డి వివ‌ర‌ణతో సంతృప్తి చెందిన బీసీసీఐ...యూసుఫ్ పై నిబంధ‌న‌ల ప్ర‌కారం 5 నెల‌ల నిషేధాన్ని విధించింది. ఆగ‌స్టు 15 నుంచి ఆ నిషేధాన్ని బీసీసీఐ లెక్కించ‌డంతో...ఈ నెల 14 తో అది ముగియ‌నుంది. దీంతో, ఈ ఏడాది ఐపీఎల్ లో యూసుఫ్ ఆడేందుకు అవ‌కాశం ల‌భించింది.
Tags:    

Similar News