ప్రముఖ బెంగాలీ నటి... పార్లమెంట్ ఎంపీ నుస్రత్ జహాన్ ఆస్పత్రి పాలుకావడం హాట్ టాపిక్ గా మారింది. దేశంలోనే అతి పిన్న వయస్కురాలు.. అందమైన ఎంపీగా మీడియాలో హైలెట్ అయిన ఈమె ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ నిఖిల్ జైన్ ను పెళ్లి కూడా చేసుకొని సెటిల్ అయ్యింది. అయితే ముస్లిం అయినా కూడా నుస్రత్ హిందూ సంప్రదాయం ప్రకారం తాళి కట్టించుకొని నుదిటన బొట్టు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. ఆమెకు ముస్లిం సంఘాలు ఫత్వాలు కూడా జారీ చేశాయి.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బసీరహత్ నియోజకవర్గం నుంచి తృణమూల్ తరుఫున పోటీచేసిన నుస్రత్ బీజేపీ అభ్యర్థిని ఓడించి ఎంపీగా గెలిచారు.
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సిన ఎంపీ నుస్రత్ ఆదివారం రాత్రి ఆసుపత్రి పాలయ్యారు. ఆదివారం తన భర్త నిఖిల్ జైన్ బర్త్ డే వేడుకల్లో విందులో ఎంపీ నుస్రత్ తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశారు. అనంతరం అధిక మోతాదులో మందులు తీసుకోవడం వల్ల అస్వస్థతకు గురైంది. ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఆమె ఆరోగ్యం చెడడంతో హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
అస్థమా సమస్యతో బాధపడుతున్న నుస్రత్.. చలికాలం కావడం రాత్రంతా బయట చలిలో పార్టీలో ఎంజాయ్ చేశారు. దీంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది.