కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా తెలంగాణ పోలీసులు కూడా తెలివిమీరిపోయారు. ఇప్పుడు బలమైన వెపన్ గా మారిన సోషల్ మీడియాపై నిఘా పెడుతున్నారు. దీని ద్వారానే ప్రజల్లో అలజడులు, గొడవలు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న దృష్ట్యానే దానిపై నిఘా కోసం ప్రత్యేకంగా ఓ టీంను ఏర్పాటు చేశారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి విద్వేశాలు రెచ్చగొట్టిన ఇద్దరు నేతలపై పోలీసులు సీరియస్ గా స్పందించారు. ఏకంగా పీడీయాక్ట్ పెట్టి ఏడాది పాటు బెయిల్ దొరకకుండా జైలుకు పంపారు. మతపరమైన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.
ఇటీవల బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో హైదరాబాద్ అల్లకల్లోలం అయ్యింది. దాంతో ప్రశాంతంగా భాగ్యనగరంలో శాంతి భద్రతల సమస్యలు ఏర్పడ్డాయి. ఇక రాజాసింగ్ పై కోపంతో ఓ వర్గం వారు మరింతగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టి జనాన్ని తీసుకొచ్చి కమిషనర్ కార్యాలయం ముందు.. రాజాసింగ్ ఇంటిని ముట్టడించారు. ఈక్రమంలోనే మతపరమైన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని.. ఇప్పటికే ఇద్దరు నేతలపై పీడీ యాక్ట్ పెట్టామని సీపీ సీవీఆనంద్ తెలిపారు.
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై ‘స్మాష్’ అనే సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని.. ఇది సోషల్ మీడియాలో ప్రతీపోస్టుపై నిఘా ఉంచుతుందని సీపీ తెలిపారు.
ఇక రాష్ట్రంలో 600మంది డ్రగ్స్ వాడుతున్నారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వీరంతా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువమంది బీటెక్ విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. వారి వివరాలు బయటకు చెపితే తల్లిదండ్రులే షాక్ అవుతారని.. వెల్లడించడం లేదన్నారు. అమెజాన్ వంటి సంస్థల నుంచి కూడా డ్రగ్స్ ఆర్డర్స్ వస్తున్నట్లు తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.