దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత పది రోజుల్లోనే దేశంలో కరోనా తీవ్రత తీవ్రస్థాయికి చేరింది. కరోనా జోరు ఎంతలా పెరిగింది అంటే ఒక్కరోజు కేసుల్లో ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది భారత్. అమెరికాలో ఇప్పటివరకు ఒక్కరోజులో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అయిన రికార్డ్ ఉండేది. దాన్ని భారత్ బద్దలుకొట్టింది. ఇక కరోనా సోకిన వారికి ప్రధానంగా వచ్చే సమస్య..ఆక్సిజన్ అవసరం. అయితే , ప్రస్తుతం కరోనా బాధితులకి కావాల్సినంత ఆక్సిజన్ లేకపోవడంతో వైద్యులు కూడా ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకుంటేనే చికిత్స చేస్తాం లేకపోతే లేదు అని అంటున్నారు. ఈ తరహా ఘటనలు దేశంలో చాలా వెలుగులోకి వచ్చాయి.
ఇకపోతే, ఇదే తరహా ఘటనలు వరంగల్ లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కరోనా తో ప్రాణాలు పోతాయా అని అనేకంటే ..ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు పోయే ప్రమాదం ఏర్పడింది. దీనితో వైద్యాధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. గత మూడు రోజులుగా వరంగల్‌లోని ఆస్పత్రులకు సరిపడా ఆక్సిజన్ సరఫరా కావడం లేదు. రూ.600కు దొరకాల్సిన బల్క్ సిలిండర్ ను రూ.2000కు విక్రయిస్తున్నారు. ఇప్పుడు అంత డబ్బు పెట్టి కొనడానికి సిద్ధంగా ఉన్నా , సీలిండర్లు దొరకని పరిస్థితి. దీనితో ప్రైవేటు ఆస్పత్రుల వారు కరోనా రోగులను పంపించి వేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్ ను తెచ్చుకుంటేనే చికిత్స అని చెప్తున్నారు.
వరంగల్ లో ఎంజీఎంతో పాటు 50 ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నాయి. కరోనా రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో ఆక్సిజన్ వాడకం కూడా గతంలో కన్నా వంద రెట్లు పెరిగింది. ఇంతకుముందు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రోజుకు 500 సిలిండర్లు సరిపోయేవి. ఇప్పుడు వెయ్యి కూడా సరిపోవడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు ఐదువేల సిలిండర్లు అందుబాటులో ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. వరంగల్ లో మూడు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి. వీటికి సాధారణంగా హైదరాబాద్, బల్లార్ష, బెంగుళూరు నుంచి ముడిసరుకు వస్తుంది. కానీ గత కొద్ది రోజులుగా సరుకు రాకపోవడంతో ఆక్సిజన్ ఉత్పత్తి ఆగిపోయింది. ఆక్సిజన్ అందక హాస్పిటల్ లో ఉన్న రోగులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి. కనీసం బ్లాక్ లో ఎంత పెట్టి అయినా కొనడానికి సిద్ధంగా కుటుంబ సభ్యులు ఉన్నా కూడా సీలిండర్లు దొరకడంలేదు.