సోషల్ మీడియా మహా దూకుడుగా దూసుకెళుతున్న ఈ రోజుల్లో ఏది నిజం? ఏది అబద్ధం అన్నది తేల్చటం చాలా కష్టంగా మారింది. విపరీతమైన ఆసక్తిని రేపే ఉదంతాల్లో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా.. లక్షలాది మంది దీని గురించి మాట్లాడుకోవటం కనిపిస్తుంది. తాజాగా అలాంటి ఉదంతమే యూట్యూబ్ సంచలనంగా మారింది. ఇంతకీ అంత సంచలనంగా మారిన వ్యక్తి ఎవరో తెలుసా? ఒక బిచ్చగాడు. అసలుసిసలు బిచ్చగాడు. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ లో జరిగినట్లుగా చెబుతున్న ఈ యూట్యూబ్ నిజమో కాదో కానీ..నిజంగా జరిగినట్లుగా ఒక వార్తను ప్రసారం చేశారు.
దాని ప్రకారం.. వికారాబాద్ లోని ఒక బ్యాంకు క్యూలో నిలుచున్న బిచ్చగాడు.. బ్యాంకులోకి వెళ్లాక తన దగ్గరున్న మూటను విప్పదీసే సరికి అక్కడి బ్యాంకు సిబ్బందికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందట. ఎందుకంటే.. సదరు బిచ్చగాడి మూటలో ఉన్నది వెయ్యో.. పదివేలోకాదు.. ఏకంగా రూ.50 లక్షల సొమ్ము. తాజాగా పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు సదరు బిచ్చగాడు బ్యాంకుకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఇంత డబ్బు నీకు ఎక్కడినుంచి వచ్చిందని అడిగిన సదరు బ్యాంకుసిబ్బందికి.. తనకు చెందిన పొలాన్ని అమ్మానానని.. దానికి సంబంధించిన డబ్బుతో పాటు.. మరికొంత డబ్బు తన దగ్గర ఉందని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఇంత మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు తప్పనిసరి అని బ్యాంకు సిబ్బంది చెప్పినంతనే.. మరుక్షణం ఆలోచించకుండా జేబులో ఉన్న పాన్ కార్డు తీయటంతో బ్యాంకు సిబ్బందికి మరో షాక్ తగిలినంత పనైందని చెబుతున్నారు. యూట్యూబ్ లో సంచలనంగా మారిన ఈ బిచ్చగాడి స్టోరీ ఎంత నిజమో తెలీదు కానీ.. లక్షలాది మంది ఇతగాడి న్యూస్ చదివేందుకు.. చూసేందుకు ఆసక్తి వ్యక్తమవుతోందని చెప్పక తప్పదు.