ఫిబ్రవరి 14వ తేదీ వస్తోందంటే చాలు.. యువతరం వెర్రెత్తి పోతుంది. తమ హృదయంలో కొలువున్న వారిపై.. తమ ప్రేమ ఏ పాటిదో చూపించాలని తెగ తాపత్రయ పడుతుంది. ఏ విధంగా చూపించాలో తెలియక తెగ ఆందోళన పడుతుంది. ఎప్పుడు తొడిగిన ప్రేమ మొగ్గలన్నీ.. వాలెంటైన్స్ రోజునే వికసిస్తాయి. అప్పటికే పూసిన పూవులన్నీ.. మరింత తాజాగా కళకళలాడుతుంటాయి. మరి, ఎందుకిలా? ఏడాదిలో 365 రోజులు ఉండగా.. ఆ ఒక్కరోజునే ఎందుకిలా? ప‌్రేమికుల రోజుగా ఫిబ్రవరి 14 మాత్రమే ఎందుకైంది?
‘వాలెంటైన్స్ డే’ అనే వేడుక వాలెంటైన్ అనే వ్యక్తి నుంచి వచ్చింది. అయితే.. ఆ వాలెంటైన్ ఎవరు? అనే అంశంపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే.. ఎక్కువ మంది విశ్వసించేది చూద్దాం. సెయింట్ వాలెంటైన్ అనే వ్యక్తి మూడవ శతాబ్దపు రోమ్ నగర వాసి. అప్పుడు రోమ్‌ని రెండో క్లాడియస్ అనే చక్రవర్తి పాలిస్తూ ఉండేవారు. తన రాజ్యంలో పెళ్లిళ్లు నిరాకరించాడు రాజు. కుటుంబంలో పడితే.. మంచి సైనికులు కాలేరన్న ఉద్దేశంతో అలా చేశాడు.
ఇది వాలెంటైన్‌కు నచ్చలేదు. దాంతో చక్రవర్తి ఆదేశాలను బేఖాతరు చేస్తూ పెళ్లిళ్లు జరిపించడం మొదలు పెట్టాడు. విషయం తెలుసుకున్న క్లాడియస్ వాలెంటైన్ ను జైల్లో పెట్టి, మరణశిక్ష విధించారు. అయితే.. ఆ జైలర్ కుమార్తెతో ప్రేమలో పడ్డారు వాలెంటైన్. స్త్రీ పురుషుల ప్రేమను కాదనే హక్కు ఎవరికీ లేదని వాదించిన వాలెంటైన్ ను .. ఫిబ్రవరి 14న ఉరితీశారు.
ప్రేమికుల కోసం తన జీవితాన్నే అర్పించిన వాలెంటైన్స్ మరణించిన రోజునే ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం మొదలు పెట్టారు ప్రేమికులు. ఈ వేడుకను తొలిసారిగా క్రీ.శ. 496 సంవత్సరంలో జరుపుకున్నారని చెప్తుంటారు.
కాగా.. వాలెంటైన్స్ డేకి ఈ ఆధునిక యుగంలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. కానీ.. కొన్ని దేశాలు మాత్రం ప్రేమికుల రోజుని వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా ముస్లిం దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. వాలెంటైన్స్ డే ఇస్లాంకు వ్యతిరేకం అంటూ.. సౌదీ అరేబియా ఈ వేడుకను నిషేధించింది. పాకిస్తాన్ లోనూ ఈ వేడుక చేయకూడదు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇండోనేషియాలోనూ వ్యతిరేకత పెరుగుతోంది. భారతదేశంలోనూ ఓ వర్గం వ్యతిరేకిస్తోంది.