కరోనా వైరస్ మహమ్మారి .. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ, రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. గత ఏడాది డిసెంబర్ లో చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటి 60 లక్షల మందికి కరోనా సోకగా ..ఆరున్నర లక్షల మంది కరోనా భారిన పడి మరణించారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ..కరోనా పై రకరకాలుగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో వోడ్కా తీసుకొంటే కరోనా రాదు అని సంచలన వ్యాఖ్యలు చేసారు.
తనకు వైరస్ సోకిందని వెల్లడించారు. అయితే, కరోనా వైరస్ ను నిర్మూలించాలంటే, వోడ్కాకు మించిన డ్రగ్ లేదని ఆయన కొత్తగా వెల్లడిస్తున్నారు. పెద్ద పెద్ద క్రీడా కార్యక్రమాలను రద్దు చేయడానికి ఆయన నిరాకరిస్తున్నారు. లాక్ డౌన్ విధించడానికి ఆయన ససేమిరా ఒప్పుకోవడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ ప్రబలుతున్నా ఆయన..ఐస్ ఆటను ఆడుతున్నారు. రోజుకు 50 ML వోడ్కా తాగడం వల్ల వైరస్ నుంచి రక్షించుకోవచ్చని దేశ ప్రజలకి సలహాలు ఇచ్చారు. ఈ వ్యాధితో ఇప్పటి వరకు అక్కడ 538 మంది చనిపోయారు.తమకు ఇప్పటికే దీనిపై అనుభవం ఉందని, చైనా, అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఉన్న వైరస్ ..ఎలా వ్యాపిస్తుందో..తదితర పరిణామాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు ధైర్యంగా సానుకూలంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలు క్రమం తప్పకుండా ఆవిరిని పట్టుకోవాలన్నారు.