ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇంటెల్ లో పనిచేస్తూ కరోనా బారిన పడ్డాడంటూ వార్తల్లోకి ఎక్కిన తెలంగాణ టెకీ వ్యవహారం ఇప్పుడు భాగ్యనగరితో పాటు ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరునూ పెను కలవరానికే గురి చేసిందని చెప్పాలి. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ టెకీ... ఇటీవలే దుబాయి నుంచి బెంగళూరు వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ కు ప్రయాణించాడని, ఈ క్రమంలో దుబాయి నుంచి బెంగళూరుకు అతడు ప్రయాణించిన విమానం, బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన బస్సులలో అతడితో కలిసి ప్రయాణం చేసినవారెవరన్న విషయంపై ఇప్పటికే పెద్ద ఎత్తన సెర్చింగ్ జరుగుతోంది. ఇలాంటి క్రమంలో అతడి ఫ్లాట్ లో అతడితో కలిసి నివాసం ఉంటున్న ధీరజ్ అనే టెకీ తన కార్యాలయానికి పంపిన ఓ మెయిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చింది. ఈ మెయిల్ పెను కలకలమే రేపుతోంది. ఈ మెయిల్ తో అటు ఇంటెల్ సంస్థ ఉద్యోగులతో పాటు అతడు ఉంటున్న అపార్ట్ మెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న వైనం హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇంతగా అందరినీ కలవరానికి గురి చేసిన సదరు మెయిల్ లో ధీరజ్ ఏమని ప్రస్తావించారన్న విషయానికి వస్తే... ‘‘కరోనా సోకిందంటూ ఇటీవలి వార్తల్లో నిలిచిన తెలంగాణ టెకీ నా ఫ్లాట్ మెట్టే. కొద్దికాలం పాటు అతడు నా వద్దే ఉన్న నేపథ్యంలో అతడికి కరోనా సోకిందన్న వార్తలతో నేను చెకప్ కు వెళ్లాను. అంతేకాకుండా ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణిస్తూ ఈ రోజే సిక్ లీవ్ పెడుతున్నా. నా టీమ్ మెంబర్స్, సైట్ మెంబర్స్ సేఫ్టీ దృష్ట్యా ఇంటి నుంచే పనిచేయాలని నిర్ణయించుకున్నా’’ అంటూ ధీరజ్ తన మెయిల్ లో పేర్కొన్నారు. ఈ మెయిల్ ఎలా సోషల్ మీడియాలోకి వచ్చిందో తెలియదు గానీ... వైరల్ గా మారిపోయింది. అంతేకాకుండా తెలంగాణ టెకీ వ్యవహారంతో ఇటు హైదరాబాద్ లో హైఅలర్ట్ నెలకొనగా... ఈ మెయిల్ పుణ్యమా అని బెంగళూరులోని కలకలం రేగింది.
ఇదిలా ఉంటే... తెలంగాణ టెకీ, ధీరజ్ కలిసి ఉంటున్న అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారంతా కూడా ఇప్పుడు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. అయితే కరోనా టెస్టులు చేయించుకున్న ధీరజ్ కు టెస్టుల్లో నెగెటివ్ అని తేలడంతో సదరు అపార్ట్ మెంట్ వాసులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. మొత్తంగా తెలంగాణకు చెందిన టెకీ... బెంగళూరులో పనిచేయడం, దుబాయికి వెళ్లి రావడం, బెంగళూరు నుంచి తన సొంతూరు పయనం అంటూ హైదరాబాద్ రావడం, ఈ క్రమంలో అతడితో ఫ్లైట్, బస్సులలో ప్రయాణం చేసిన వారు ఎవరన్న విషయాలు ఇంకా తెలియకపోవడం, ధీరజ్ మెయిల్ తదితరాలతో ఇప్పుడు హైదరాబాద్ తో పాటు బెంగళూరులో పెను కలకలమే రేగిందని చెప్పాలి.