మత్స్యకన్యపై భారీ చేప దాడి... వీడియో వైరల్!

ఈ సమయంలో ఆ మత్స్యకన్యపై ఓ భారీ చేప దాడికి పాల్పడింది.

Update: 2025-02-01 04:14 GMT

మత్స్యకన్యలు ఉంటారా..? అని అడిగితే... 'సాహస వీరుడు సాగర కన్య' సినిమాలో చూడటమే.. బయట పెద్దగా పరిచయం లేదు అనేది చాలా మంది సమాధానం అని అంటారు. ఈ క్రమంలో ఓ యువతి మత్స్యకన్యగా మారి, అక్వేరియంలో ప్రదర్శన చేస్తుంది. అది చూసినవారంతా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆ మత్స్యకన్యపై ఓ భారీ చేప దాడికి పాల్పడింది.

అవును... చైనాలోని అక్వేరియంలో ఓ మహిళ మత్స్యకన్యగా ప్రదర్శన చేస్తోంది. ఈ సమయంలో ఆమెపై ఓ పెద్ద చేప అమాంతంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆమెకు గాయాలయ్యాయి. ఈ విషయం తీవ్ర సంచలనంగా మారగా.. చూస్తున్నవారు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... చైనాలోని జిషువంగ్ బన్నా ప్రిమిటివ్ ఫారెస్ట్ పార్క్ లో ఓ యువ రష్యన్ మత్స్యకన్య మాషా (22) అక్వేరియంలో ప్రదర్శన ఇస్తోంది. అది చూసి అక్కడున్నవారంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలో సడన్ ఓ పెద్ద చేప ఆమెపై దాడి చేసింది. నోటితో అమాంతం మాషా తలను కరవబోయింది. అప్రమత్తమైన ఆమె తప్పించుకుంది.

బికినీ టాప్, మెర్మైడ్ టైల్ ధరించిన మాషా.. ట్యాంక్ లో తిరుగుతూ, గ్లాస్ వెలుపల నుంచి చూస్తున్న ప్రేక్షకుల వైపు తిరిగి ఉంది. ఆమె తన పనిలో అలా బిజీగా ఉండగా.. చుట్టు ఉన్న చేపల మధ్య అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించింది. ఇంతలోనే భారీ చేప కనిపించడంతో ఆ దృశ్యం ఒక్కసరిగా పీడకలలా మారిపోయింది.

ఈ సమయంలో పిల్లలు, ఇతర వ్యక్తులు భయంతో కేకలు వేశారు. ఈ దాడిలో మత్స్యకన్య మాషా మెడ, ముక్కు, కంటి వద్ద గాయాలయ్యాయని చెబుతున్నారు. ఈ దాడి అనంతరం ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పటికీ ప్రదర్శనను కొనసాగించిందని చెబుతున్నారు. ఈ సమయంలో ఆమెకు $100 నైతిక నష్టపరిహారం అందించబడిందని తెలుస్తోంది.

ఇక దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారగా... ‘ఆమె చాలా అదృష్టవంతురాలు, తృటిలో తప్పించుకుంది’ అని ఒకరంటే... ‘ఆమె ఈ దాడి తర్వాత కూడా ప్రదర్శన ఇచ్చిందని చెబుతుండటం నిజంగా గ్రేట్’ అని మరొకరు స్పందించారు. ఇంకొంతమందైతే.. ఆ దృశ్యాన్ని చూసి 'డీప్ సీక్ వర్సెస్ ఓపెన్ ఏఐ' అని కామెంట్ చేయడం గమనార్హం!

Tags:    

Similar News