డ్రై ఐస్ అంటే ఏమిటి.. ఎందుకు ఇది అంత డేంజర్..?
ఇది ఒక్కసారి శరీరంలోకి వెళ్తే కణాలు త్వరగా చచ్చుబడిపోతాయని చెబుతారు.
డ్రై ఐస్ ను సాలిడ్ కార్బన్ డై ఆక్సైడ్ అని పిలుస్తారు. సాధారణంగా దీన్ని శీతలీకరణ ఏజెంట్ గా ఉపయోగిస్తారు. దీన్ని వైద్యంలో, ఆహార పరిశ్రమలో ఉపయోగిస్తారు. డ్రై ఐస్ ను తినడం చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక్కసారి శరీరంలోకి వెళ్తే కణాలు త్వరగా చచ్చుబడిపోతాయని చెబుతారు.
అవును... డ్రై ఐస్ ను తీసుకోవడం వల్ల శరీరంలోని కణాలు త్వరగా చచ్చుబడిపోవడంతోపాటు.. శరీరంలో నరాలు దెబ్బతినడం వల్ల రక్త వాంతులు అవుతాయి. ఇదే సమయంలో.. డ్రై ఐస్ ను తీసుకుంటే.. ఆ వ్యక్తి మూర్ఛపోయే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి చనిపోవచ్చు కూడా. దీన్ని నేరుగా చేతులతో కూడా తాకకూడదు.
సాధారణంగా మంచు ఉష్ణోగ్రత మైనస రెండు నుంచి మూడు డిగ్రీలు ఉంటుంది. అయితే.. ఈ డ్రై ఐస్ ఉష్ణోగ్రత మైనస్ 80 డిగ్రీల వరకూ ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ ను సుమారు 109 డిగ్రీల ఫారెన్ హీట్ వరకూ టెంపరేచర్ తగ్గించడం ద్వారా అది మంచులా మారుతుంది. దీన్ని శీతలీకరణ ఏజెంట్ గా ఉపయోగిస్తారు.
దీన్ని సరిగా నిర్వహించకపోయినా.. లేదా, గాలి సరిగా లేని ప్రదేశాలలో ఉంచినా మానవులకు హానికరం. ఈ ఐస్ ప్యాక్ తో చర్మ కాలిపోవడం కూడా జరగొచ్చని చెబుతారు. ఇది కార్బన్ డయాక్సైడ్ ఘన రూపం అవ్వడంవల్ల వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశాల్లో పీల్చినప్పుడు ఊపిరాడకుండా చేస్తుంది. అందుకే దీని విషయంలో అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి.
కాగా.. గత ఏడాది గురూగ్రామ్ లోని ఓ రెస్టారెంట్ లో కస్టమర్లు రక్తపు వాంతులు చేసుకున్న ఘటన దేశవ్యప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఇలా కస్టమర్లు ఉన్నపలంగా రక్తపు వాంతులు చేసుకోవడానికి కారణం... వీరికి యాజమాన్యం మౌత్ ప్రెషనర్ కు బదులు డ్రై ఐస్ ఇవ్వడమే అని తెలిసింది!