విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ జోరు

Update: 2020-09-20 15:01 GMT
కరోనా వైరస్ తో దేశం దాటిపోయింది. ప్రస్తుతం యూఏఈలో జరుగుతోంది. ఈ ఐపీఎల్ సంబరం.. లేట్ గా నైనా లేటెస్ట్ గా ప్రారంభమైంది. నిన్న తొలి మ్యాచ్ జరగడంతో  దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఐపీఎల్ సందడి మొదలు కావడంతో దాంతోపాటు బెట్టింగ్ దందా కూడా స్ట్రాట్ అయ్యింది.

తాజాగా విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ పై ముఠా సభ్యులు భారీగా బెట్టింగ్ లు నిర్వహించారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముఠా సభ్యులు విజయవాడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని మరీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఆన్ లైన్ బెట్టింగ్ కు వాడే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా డీసీపీ హర్ష వర్ధన్ మాట్లాడుతూ.. ‘మొగల్రాజపురంలో ఆచార్య ప్లేస్కూల్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలిసిందని.. వెంటనే దాడి చేసి పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అవతార్ అనే యాప్ ద్వారా ఈ బెట్టింగ్ నడిపిస్తున్నారని చెప్పారు.

బాగా తెలిసిన వాళ్ల ద్వారానే ఈ బెట్టింగ్ యాప్ లో ఆడుతారని ఆయన తెలిపారు. రూ. 12 లక్షల వరకు బెట్టింగ్ జరుగుతోందని సమాచారం వచ్చిందన్నారు. ప్రధాన సూత్రధారి నవీన్ ను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.


Tags:    

Similar News