ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడుతూ అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పోలీసుల్లో కొంతమంది గతి తప్పుతున్నారు. ఖాకీ వృత్తిని ప్రజలకు సేవ చేస్తూ.. దుర్మార్గులు, అక్రమార్కుల ఆటకట్టించడానికి వాడాల్సి ఉండగా వాటిని గాలికొదిలేసి పోలీసుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
సెటిల్‌మెంట్లు, వివాహేతర సంబంధాలు, కంచే చేను మేసిన చందంగా పోలీసులే దొంగల నుంచి స్వాధీనం సొమ్మును దోచుకోవడం, రాజకీయనాయకులకు తలాడించడం వంటి పనులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా లో జరిగిన సంఘటన అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసిందని అంటున్నారు. ఒక లేడీ కానిస్టేబుల్ కోసం ఒక సీఐ, ఒక కానిస్టేబుల్ తన్నులాటకు దిగారనే వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆ సీఐని వీఆర్ కు పంపారని మీడియాలో కథనాలు వచ్చాయి.
పశ్చిమ గోదావరి జిల్లా లో సీఐ - కానిస్టేబుల్ మధ్య అదే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ లేడీ కానిస్టేబుల్ విషయంలో రెండు రోజుల క్రితం వివాదం తలెత్తి ఘర్షణ పడ్డారని అంటున్నారు. లేడీ కానిస్టేబుల్ ను కానిస్టేబుల్ తన బైకుపైన ఎక్కించుకుని తీసుకెళ్లడం సీఐకి నచ్చలేదని.. ఆ విషయమై కానిస్టేబుల్ తో గొడవ పడ్డారని అంటున్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వివాదానికి దిగారని సమాచారం. అంతేకాకుండా కొట్టుకున్నారని చెబుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టి సీఐని వీఆర్ కు పంపారని వార్తలు వస్తున్నాయి. అలాగే కానిస్టేబుల్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారని సమాచారం. పోలీసు దుస్తుల్లోనే ఉండి గొడవపడడం చూసిన స్థానికులు వీరిని చూసి షాక్ అయ్యారని అంటున్నారు.
స్కూల్ పిల్లల మాదిరిగా డ్యూటీలో ఉండగానే ఒక లేడీ కానిస్టేబుల్ కోసం కొట్టుకోవడాన్ని చూసి బిత్తరపోయారని చెబుతున్నారు. ఏమైనా చిలక్కొట్టుడు వ్యవహారాలు ఉంటే బయట చూసుకోవాలి గానీ ఇలా పోలీసు స్టేషన్ లోనే గొడవకు దిగడం బాలేదని.. వివిధ పనుల కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రజలు అంటున్నారని వార్తల సారాంశం.