అది స్వయంగా ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అంతే కాదు ఘనకీర్తి కలిగిన విశ్వవిద్యాలయం. అలాంటి చోట ఊహించని దారుణం చోటు చేసుకుంది. పీజీ చదువుతున్న ఒక మగాడ్ని సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన వర్సిటీలో తీవ్ర కలకలానికి గురి చేయటమే కాదు.. సంచలనంగా మారింది. ఇప్పటి వరకూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న వర్సిటీలో ఈ ఘటన జరగటంపై విస్మయం వ్యక్తమవుతోంది. అంతటి ప్రముఖ యూనివర్సిటీలో ఇలాంటి ఘటనా? అన్న సందేహం కలుగుతోంది. పది రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. వర్సిటీని అట్టుడిగిపోయేలా చేస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే...
ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ప్రతిష్ట్మాత్మక బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. వర్సిటీలో ఏంఏ హిందీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక పందొమ్మిదేళ్ల విద్యార్థిని కిడ్నాప్ చేసి.. సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరీ దారుణానికి పాల్పడ్డారన్న విషయం ఇప్పటికి బయటకు రావటం లేదు. మగాడ్ని సామూహిక అత్యాచారం చేసిన ఈ ఉదంతంలో నిందితులు ఎవరన్న అంశంపై స్పష్టత రావటం లేదు. ఈ దారుణంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనా.. వైద్యులు దారుణం జరిగినట్లు ధ్రువీకరించినా.. వర్సిటీ వీసీ మాత్రం దీనిపై ఇప్పటివరకూ స్పందించకపోవటం గమనార్హం.
ఇదిలా ఉండగా.. బాధితుడి ఇంట్లో ఈ ఉదంతం తీవ్రమైన షాక్ కు గురి చేసింది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీకే సిగ్గుచేటుగా చెబుతూ.. తాము ఇలాంటిది జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించేందుకు.. వివరాలు అందించేందుకు వీసీ అందుబాటులో లేనట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ మాయదారి దేశంలో ఇంతవరకూ అమ్మాయిలకు మాత్రమే రక్షణ కరువైందని అనుకునే వారు. ఈ ఘటనలో మగాళ్లకు కూడా భద్రత లేదన్న విషయం తేలిపోయింది. మనిషిని చూసి మనిషి భయపడే దారుణ రోజులు వచ్చేశాయన్న మాట.