బాబును బ్లాక్‌మెయిల్ చేస్తున్న మాజీ మంత్రి

Update: 2022-02-27 16:50 GMT
ఏపీలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఆది నుంచి ఉన్న విధానం ఏంటంటే.. తాము అనుకున్న‌ది సాధిస్తే.. ఓకే. లేక‌పోతే.. వెంట‌నే పార్టీని.. పార్టీ అధినేత‌ చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేయ‌డం.. నాయ‌కుల‌కు అల‌వాటుగా మారిపోయింది.

గ‌తంలో పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు సీమ‌కు చెందిన ఒక కీల‌క ఎంపీ.. త‌న ప్రాంతానికి ప‌ట్టిసీమ నీటిని త‌రించుకునేందుకు రిజైన్ అస్త్రాన్ని ప్ర‌యోగించి.. స‌క్సెస్ అయ్యారు. త‌ర్వాత చాలా మంది నాయ‌కులు టికెట్ల కోసం.. ఇలానే ప్ర‌య‌త్నించారు. ఇక‌, ఇప్పుడు మాజీ మంత్రి, క‌ర్నూలుకు చెందిన భూమా అఖిల ప్రియ కూడా ఇలానే బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయాల‌ని చూస్తున్నార‌ట‌!

ఈ విష‌యం క‌ర్నూలు జిల్లాలో జోరుగా చ‌ర్చ‌నీయాంశం అయింది. విష‌యంలోకి వెళ్తే.. త‌న‌కు తాను ఫైర్‌బ్రాండ్‌గా చెప్పుకొనే మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌కు ఇటీవ‌ల కాలంలో పార్టీలో గుర్తింపు త‌గ్గింది. ఆమెను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

హైద‌రాబాద్‌లో కేసులు.. స్థానికంగా టీడీపీ నేత‌ల‌తో ఉన్న విభేదాలు కార‌ణంగా.. చంద్ర‌బాబు ఆమెను ప‌ట్టించుకోవ‌డం మానేశారు.. దీంతో ఇప్పుడు.. ఆమె... ఏదో ఒకటి చేసి.. వార్త‌ల్లో నిల‌వాల‌ని కోరుకుంటున్నారట‌. ఈ క్ర‌మంలోనే  అఖిల ప్రియ కూడా సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. తాను పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఆళ్లగడ్డలో అధికార పార్టీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో అవినీతికి పాల్ప‌డుతున్నార‌న్న అఖిల‌ప్రియ‌.. ఈ అవినీతిని నిరూపిస్తాన‌ని.. కొన్నాళ్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పైగా.. సొంత పార్టీ నాయ‌కులే దీనిని ప‌క్క‌న పెడుతూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని ప్రకటించారు.  

నిజాని తాను చేసిన ప్ర‌క‌ట‌న‌తో అంటే.. అధికార పార్టీ నేత‌ల‌పై విరుచుకుప‌డ‌డంతో త‌న‌కు టీడీపీ నాయ‌కులు క‌లిసి వ‌స్తార‌ని.. త‌న‌ను హైలెట్  చేస్తార‌ని.. భూమా ఊహించుకుని ఉంటారు.

కానీ, ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో్ ఆమె మూడు నియోజ‌క‌వ‌ర్గాలు కావాల‌ని.. ఇప్ప‌టి నుంచే ప‌ట్టు బ‌ట్ట‌డం.. పార్టీలో సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డం.. వివాదాల చుట్టూ రాజ‌కీయాలు అల్లుకోవ‌డం.. ఎవ‌రినీ లెక్క‌చేయ‌క పోవ‌డం.. వంటి కార‌ణాలు.. ఆమెను పార్టీలో ఒంట‌రిని చేశాయి.

ఈ నేప‌థ్యంలో ఎవ‌రూ ఆమెతో క‌లిసి రావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే భూమా అఖిల ప్రియ ఆఖ‌రి అస్త్రంగా.. రాజీనామా అస్త్రం ఎంచుకున్నార‌ని అంటున్నారు. అయితే.. ఇది నిజ‌మైన ప్ర‌క‌ట‌న కాద‌ని.. చంద్ర‌బాబును బ్లాక్ మెయిల్ చేయ‌డ‌మేన‌ని అంటున్నారు పార్టీలో సీనియ‌ర్లు!
Tags:    

Similar News