ఈమధ్య టీడీపీ మంత్రులంతా నారా లోకేశ్ బాబును ఆదర్శంగా తీసుకుంటున్నట్లుగా ఉంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడడం.. అవగాహన లేని వ్యాఖ్యలు చేయడం ఏపీ మంత్రులకు కామన్ అయిపోయింది. చంద్రబాబు క్రెడిబులిటీని దెబ్బతీసేలా పనిచేయాలని మొన్న లోకేశ్ బాబు అన్న సంగతి మర్చిపోకముందే... మరో మంత్రి అఖిల ప్రియ ఈసారి ఏకంగా ప్రధాని మోదీపై నోరు జారారు. భాష తెలియకో.. బాధ్యత లేకో కానీ.. మోడీ ఇంతవరకు ఎన్నడూ అనని మాటను ఆయనకు ఆపాదించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆడవాళ్లను రేప్ చేయమని ప్రధాని మోదీ చెబుతున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు.
మహిళలు కనిపిస్తే దాడులు చేయండి, మానభంగాలు చేయండి అంటూ ప్రధాని మోడీయే రెచ్చగొట్టి ఉసిగొల్పుతున్నారని అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలో జరిగిన నవనిర్మాణ దీక్షలో ప్రసంగించిన మంత్రి…. మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఇలా చేస్తుంటే మోడీ మాత్రం మహిళలు ఎక్కడ కనిపిస్తే అక్కడ వారిపై దాడి చేయాలని, అత్యాచారాలు చేయాలని, మానభంగం చేయాలంటూ నేతల్ని రెచ్చగొట్టి పంపిస్తున్నారని అన్నారు. మంత్రి వ్యాఖ్యలతో దుమారం రేగింది.
టీడీపీ- బీజేపీకి మధ్య సంబంధాలు పోయినా…. మరీ ఇలా నేరుగా ప్రధాని మోడీపైనే తప్పుడు ఆరోపణలు చేయడమేంటంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు కూడా అఖిల వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు.