ఏం మాట్లాడినా క్లియర్ గా - నిర్భయంగా మాట్లాడే వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రోజురోజుకూ కుంటుపడుతున్న ఆంధ్రప్రదేశ్ విషయంలో చంద్రబాబు వ్యవహారంలో ఎలా ఉందో చెబుతూ బ్రహ్మాండమైన డైలాగ్ కొట్టారు. అస్తిపంజరంలా మారిన ఏపీకి సిక్సు ప్యాక్ తెప్పిస్తానంటున్నారంటూ చంద్రబాబుకు ఆయన కౌంటర్ వేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని భూమన ఎద్దేవాచేశారు. రాష్ట్రంలోని అన్ని రంగాలు క్షీణించి పోయాయని చెప్పారు. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయనే భ్రమల్లో చంద్రబాబు బతుకుతున్నారని దుయ్యబట్టారు.
ఇదే సమయంలో చంద్రబాబును వెనకేసుకువచ్చే కేంద్ర మంత్రి - బీజేపీ నేత వెంకయ్యనాయుడిని కూడా ఆయన ఏకిపడేశారు. ఏపీని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చూస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెబుతుంటారని... కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఒక్క రూపాయైనా ఎక్కువగా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో వెంకయ్యను చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని మండిపడ్డారు. ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు - వెంకయ్య ఇద్దరూ తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ఇద్దరూ కలిసి ఏపీ ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/