ఎయిర్ ఏషియా కుంభకోణంపై ప్రముఖ ఆంగ్ల పత్రిక బిజినెస్ టుడే ఈరోజు సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇందులో చంద్రబాబు పాత్ర బయటపడడం కలకలం రేపుతోంది. ఎయిర్ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండేజ్ కు అదే సంస్థకు చెందిన ఇండియా సీఈవో మిట్టూ శాండిల్యాకు మధ్య జరిగిన సంభాషణలో తాజాగా చంద్రబాబు దళారీల వ్యవహారం ప్రస్తావనకు రావడం కలకలం రేపుతోంది. అంతర్జాతీయంగా కలకలం రేపుతోన్న ఈ ఉదంతంపై అన్ని ఆంగ్ల దినపత్రికలు ప్రచురించడంతో వార్త వైరల్ గా మారింది.
చంద్రబాబు అవినీతి బయటపడడంతో తాజాగా హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. ఎయిర్ ఏషియా కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్లు బయటపడడంతో వారి అవినీతి స్థాయి ఏమిటో మరోసారి బట్టబయలైందని అన్నారు. అక్రమ మార్గంలో ఏ పని జరగాలన్నా చంద్రబాబును కలిస్తే సరిపోతుందని.. ఆయన అవినీతి ఎయిర్ ఎషియా కుంభకోణంతో ప్రపంచస్థాయికి చేరిందని కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద దళారీ నాయకుడిగా చంద్రబాబు అవతరించాడని భూమన ఎద్దేవా చేశారు.
ఎయిర్ ఏషియా కుంభకోణంతో చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం ఎంతదాకా విస్తరించిందో తేటతెల్లమైందని కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా ఎల్లో మీడియా ఎందుకు మౌనంగా ఉందని ఆయన నిలదీశారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు మహిళాలోకాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.