జెండావందనంలో కాంగ్రెసోళ్లు కొట్టుకున్నారు

Update: 2016-01-26 07:31 GMT
కొట్లాటలు - కుమ్ములాటలకు మారుపేరైన కాంగ్రెస్ నాయకులు ఎలాంటి సందర్భంలోనైనా వివాదాలకు వెనుకాడరు. దేశమంతా గర్వంగా, గంభీరంగా గణతంత్ర వేడుకలు జరుపుకొంటున్న సమయంలో కాంగ్రెస్ నేతలు ఆ జెండాపండుగలోనూ చొక్కాలు - కాలర్లు పట్టుకున్నారు. నల్గొండ జిల్లా భువనగిరిలో కాంగ్రెస్ నేతలు జెండా ఎగరవేయడానికి పోటీపడి చివరికి కొట్టుకుని పోలీసు స్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నారు.

రిపబ్లిక్ డే రోజున జెండాను ఎవరు ఎగరేయాలన్న విషయంలో భువనగిరిలో కాంగ్రెస్ నేతల మధ్య వివాదమేర్పడింది. భువనగిరి టౌను కాంగ్రెస్ నేతలు దీనిపై ఘర్షణ పడ్డారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు ఇద్దరూ దీనికోసం పోటీపడడంతో ఘర్షణ పెరిగి ఇద్దరి అనుచరులు బాహాబాహీకి దిగారు. రెండు వర్గాలు జెండా సాక్షిగా దారుణంగా కొట్టుకున్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. చివరకు అక్కడ జాతీయ జెండా ఆవిష్కరణ కూడా ఆగిపోయింది. కాంగ్రెస్ నేతలా మజాకానా?

Tags:    

Similar News