మళ్లీ తాలిబన్ల పాలన మొదలుకావడంతో ఆఫ్ఘానిస్తాన్ ఇప్పటికే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ సమయంలో ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ముందు గురువారం సాయంత్రం రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. అమెరికన్ వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఈ పేలుళ్లలో దాదాపుగా 80 మంది కన్నుమూశారు. అలాగే, ఇందులో 200 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలో 12 మంది యూఎస్ మెరైన్ కమాండర్లు కూడా ఉన్నారు. వీరితో పాటు 15 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు చెప్తున్నారు.
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. కాబూల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద దాడులకు పాల్పడినవారు ఇంతకు ఇంతా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరికలు జారీ చేశారు. మేము ఎవ్వర్నీ క్షమించం.. ఏదీ మరిచిపోం.. మేము వేటాడి పట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం అని బైడెన్ అన్నారు. కాబూల్ ఆత్మాహుతి దాడులపై వైట్ హౌస్ నుంచి ప్రసంగించిన జో బైడెన్, అఫ్గన్ నుంచి తరలింపు కొనసాగుతుందని తెలిపారు.దాడుల వెనుక తాలిబన్లు, ఐఎస్ ఉగ్రవాదుల కుట్ర సంకేతాలు లేవని అన్నారు.
అఫ్గన్‌స్థాన్ విషయంలో అమెరికా దళాలతో ఖచ్చితత్వంతో స్పందిస్తుంది. అఫ్గనిస్థాన్ నుంచి అమెరికా పౌరులను సురక్షితంగా తీసుకొస్తాం, మేము మా అఫ్గన్ మిత్రులను బయటకు తీస్తాం. మా మెషిన్ కొనసాగుతుంది. అఫ్గనిస్థాన్ భూభాగం నుంచి అమెరికా దళాలను ఉపసంహరణకు తాలిబన్లతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం చేసుకున్నారు. కానీ తాలిబన్లు ఇతర దేశాలపై దాడిచేస్తూనే ఉన్నారు, అమెరికాపైనే కాదు అన్నారు.
ఇప్పటి వరకూ లక్ష మందిని అఫ్గన్ నుంచి తరలించామని, దళాల ఉపసంహరణకు ఆగస్టు 31 తుది గడువని జో బైడెన్ గుర్తుచేశారు. కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి గౌరవార్ధం సంతాప సూచికగా అధ్యక్షభవనం వైట్‌హౌస్, సైనిక, నౌకదళ, వైమానిక స్థావరాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమెరికా జాతీయ పతాకాన్ని ఆగస్టు 30 వరకు అవనతం చేయాలని జో బైడెన్ తెలిపారు. ఈ దాడులను తాలిబన్లు ఖండించారు.