ప్రస్తుతం తీవ్ర వివాదాస్పద రీతిలో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక, పార్టీలో ఉండి కూడా ప్రయోజనం లేదని.. ఆయన భావిస్తున్నారు. అదేసమయంలో టీఆర్ ఎస్ బీఫారంపై లభించిన ఎమ్మెల్యే పదవిని సైతం వదులుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటు పార్టీకి, అటు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించే విషయంపై చూచాయగా.. సంకేతాలు ఇచ్చేశారు. మరికొన్ని గంటల్లోనే తాను తన నియోజకవర్గం ప్రజలతో ను, మేదావులతోనూ భేటీ అవుతానని.. వారికి `ఒకమాట` చెప్పి.. తను నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. అంటే.. దీనిని బట్టి ఆయన ఎమ్మెల్యే సహా పార్టీకి కూడా రాజీనామా సమర్పించనున్నారనే విషయం స్పష్టమైంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వ్యవహారంపై కూడా ఈటల సంచలన ఆరోపణలు చేశారు.
కేసీఆర్ మంత్రి వర్గంలోని ఏ ఒక్కరూ కూడా ఇష్టంగా లేరని.. ఎవరూ కూడా ఆత్మతృప్తిగా, సంతోషంగా పని చేయడం లేదని, మనసులో తిట్టుకుంటూ.. పైకి పొగుడుతూ వ్యవహరిస్తున్నారని.. అన్నారు. తాను దాదాపు 14 సంవత్సరాలుగా కేసీఆర్‌తో కలిసి పయనించానని.. అప్పట్లో తమ్ముడు అంటూ కావలించుకున్న కేసీఆర్‌కు ఇప్పుడు తనలో ఏం తప్పులు కనిపించాయని ప్రశ్నించారు. అయినా.. మంత్రి వర్గం నుంచి తనను తొలగించేందుకు కేసీఆర్‌కు సంపూర్ణ హక్కులు ఉన్నాయని.. అదేసమయంలో పార్టీలో కొనసాగాలా వద్దా అనే విషయాలపై తనకు కూడా హక్కు ఉందని అన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణ భవన్ కూల్చేసి, ఆ స్థలాన్ని ఆక్రమించుకు నేందుకు ప్రయత్నిస్తే.. కేసీఆర్‌తోపాటు తాను కూడా జాగారం చేసి మరీ.. ఫైట్ చేసిన విషయాన్ని కేసీఆర్ మరిచిపోయినా.. తాను మరిచిపోలేదన్నారు. కేసీఆర్ అడుగు జాడల్లో నడిచిన తనలోనూ పౌరుషం ఉందని, ఆత్మ గౌరవం ఉందని.. తాను ఏ తప్పూ చేయలేదని, నివేదికలు తప్పు తడకలుగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. తనను జైలుకు పంపినా వెళ్తానని, పార్టీ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమన్నా.. ఈ క్షణం తాను సిద్ధంగా ఉన్నాన్నారు. ఇక, తను రాజీనామా చేసే విషయంపై తన నియోజకవర్గం ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. మొత్తంగా ఈటల ఏం నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తిగా మారిది.