భీమ‌వ‌రం స‌భ‌లో అదే పెద్ద లోటు !

Update: 2022-07-05 01:21 GMT
భీమవరం సభకు ఓ విధంగా ప‌వ‌న్ వ‌స్తే బాగుండేది. కానీ స్టేజీ పైన జ‌గ‌న్ ఉన్నారు అన్న ఓకే ఒక ఉద్దేశంతో రాలేదు.. ఇదీ భీమ‌వ‌రంలో జ‌రిగిన ప్ర‌ధాని స‌భ‌కు సంబంధించి వినిపిస్తున్న వాద‌న. ప‌వ‌న్ వ‌చ్చి 4 మాట‌లు మాట్లాడితే ఇంకా బాగుండేది. దేశం గురించి, ఐక్య‌త గురించి ఎప్పుడూ త‌న ప్ర‌సంగాల్లో ఆవేశ‌పూరితంగా మాట్లాడే ప‌వ‌న్ రాక‌పోవ‌డం లోటు.

నిజంగానే లోటు. చిరు వ‌చ్చినా ప‌వ‌న్ అంత ఎఫెక్టివేట్ గా మాట్లాడ‌లేరు. ప‌వ‌న్ కాస్త దేశ భ‌క్తి ని పెంపొందించే మాట‌లే మాట్లాడ‌గ‌ల‌రు. గుర‌జాడ‌ను త‌లుస్తూ, క‌వి  శ్రీ‌శ్రీ‌ని స్మరిస్తూ ఎక్కువ‌గా ప‌వ‌న్ ప్ర‌సంగాలు ఉంటాయి. ఆ స్థాయిలో చిరు మాట్లాడ‌లేరు క‌నుక ప‌వ‌న్ వ‌స్తే స‌భ‌కే నిండుద‌నం వ‌చ్చేది.

ఇక చిరును బీజేపీకి గూటికి చేర్చే ప్ర‌య‌త్నం ఏమ‌యినా జ‌రిగితే జ‌ర‌గ‌వ‌చ్చు. నిన్నటి నుంచి ఇవే అనుమానాలు. అదే జరిగితే... అల్లూరి కార్యక్రమాన్ని కూడా మోడీ రాజకీయం చేసినట్టే అనుకోవాలి.

ఎప్ప‌టి నుంచో ప‌వ‌న్ క‌ల్యాణ్, బీజేపీతో స‌ఖ్యంగానే ఉంటున్నారు. కానీ ఎందుక‌నో ఇప్పుడిప్పుడే దూరం అవుతున్నారు. పొత్తుల విష‌య‌మై స్ప‌ష్ట‌మైన వైఖరి బీజేపీ నాయ‌క‌త్వం చెప్ప‌ని కార‌ణంగానే ఆయ‌న దూరం అవుతున్నారు అని తెలుస్తోంది. ఇదే సంద‌ర్భంలో బీజేపీ కొన్ని ప్ర‌త్యామ్నాయాల వైపు చూస్తోంది. రాజ‌కీయంగా అవి త‌ప్పేం కాదు కానీ ప‌వ‌న్ కు అవి న‌చ్చ‌డం లేదు. ఏ విధంగా చూసుకున్నా ప‌వ‌న్,బీజేపీతో ఉండ‌ర‌న్న‌దే తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో ఇక‌పై ముందుకు వెళ్లాల‌ని ఆయ‌న భావిస్తు న్నార‌ని తెలుస్తోంది. మొత్తానికి భీమవరం సభతో మోడీ పవన్ బంధం తెగిపోయిందని అర్థం చేసుకోవచ్చు.

ప‌వ‌న్ ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్రక‌టిస్తేనే ఏ పార్టీతో అయినా మైత్రి ఉంటుంద‌ని ఇదివ‌ర‌కే జ‌న‌సేన వ‌ర్గాలు తేల్చేశాయి. కానీ బీజేపీ ఎన్నిక‌లు అయ్యాక ఫ‌లితాలు వ‌చ్చాక అప్ప‌టి ప‌రిణామాల‌ను అనుస‌రించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని, మా పార్టీ విధానం ప్రకార‌మే న‌డుచుకుంటామ‌ని చెబుతోంది. ఇది కూడా ప‌వ‌న్ వ‌ర్గాల‌కు న‌చ్చ‌డం లేదు.

ఓ సారి త్యాగం చేశాక ఫ‌లితం సున్నా అని తేలిపోయింది.. మ‌ళ్లీ త్యాగాలు చేసేందుకు మేం సిద్ధంగా లేం.. ప‌వ‌న్ ను  ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తే పొత్తులుంటాయి లేదంటే లేదు అని తేల్చేశాయి  గ‌తంలోనే జ‌న‌సేన వ‌ర్గాలు. పీఎం సభ‌కు ప‌వ‌న్ రాక‌పోయేందుకు మ‌రో కార‌ణం పొత్తుల విష‌య‌మై  ఎటువంటి స్ప‌ష్ట‌తా రాష్ట్ర బీజేపీ ఇవ్వ‌క‌పోవ‌డమే కావొచ్చు!
Tags:    

Similar News