కర్ణాటక, మహారాష్ట్ర మధ్య ఒక్క భూభాగం కోసం యుద్ధం మొదలైంది.. కర్ణాటక సరిహద్దున ఉన్న ఆ రాష్ట్రానికి చెందిన బెళగావి జిల్లాను మహారాష్ట్రలో కలిపేయాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేయడం తో అక్కడ నిరసనలు జోరందుకున్నాయి. కర్ణాటకలోని బెళగావి జిల్లా మొత్తాన్ని మహారాష్ట్రలో కలపాలని శివసేన నేతలు ఆ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు ల్లో ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు.
బెళగావి జిల్లా మహారాష్ట్ర సరిహద్దు న కర్ణాటక రాష్ట్రం లో ఉంది. ఇక్కడ కన్నడ కంటే మరాఠీ నే ఎక్కువ గా మాట్లాడుతారు. మరాఠా సంస్కృతినే ఎక్కువ. రాష్ట్రాల పునర్విభజనకు ముందు ఈ బెళగావి జిల్లా మహారాష్ట్రలోనే ఉండేది. అయితే ఆ తర్వాత కర్ణాటక ఏర్పడ్డాక ఈ రాష్ట్రం లోకి వచ్చింది. తాము కోల్పోయిన ప్రాంతాన్ని తిరిగి ఇవ్వాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ కోరడం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. కర్ణాటక సీఎం యడ్యూరప్ప దీనిపై సీరియస్ అయ్యారు. ఫడ్నవీస్ ఉండగా ఏ పంచాయితీ లేదని.. ఉద్దవ్ వచ్చి చిచ్చుపెట్టవద్దని.. బెళగావిని వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
కొల్హాపూర్, బెళగావి జిల్లాలో కన్నడ బస్సులపై దాడులు, కన్నడ సినిమాలు ఆపుచేయించి శివసేన నేతలు సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తూ చెలరేగిపోతున్నారు. మరి ఈ పంచాయితీ ఎటు దారితీస్తుందనేది ఉత్కంఠగా మారింది.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ మాటలు నిజమైతే నిజాం కాలంలో తెలంగాణలో ఉన్న నాందేడ్, చంద్రాపూర్, ఔరంగాబాద్ లను కూడా తెలంగాణకు ఇచ్చేయాలి.. భాష ప్రయుక్తం ప్రకారం మహారాష్ట్రలో కలిపేశారు. బెళగావిని తీసుకుంటే తెలంగాణ కు మహారాష్ట్ర లో కలిసిన ప్రాంతాలు ఇవ్వాలని కన్నడ వాసులు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక లోని బీదర్ కూడా ఒకప్పుడు నిజాం ప్రభుత్వ హైదరాబాద్ లోనే ఉండేది.