వంగవీటి రాధాకు అదే పెద్ద సమస్య

Update: 2022-12-27 05:30 GMT
రాజకీయాల్లో మంచి పేరును వాడుకోవడం కొందరు నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఒక పేరు ప్రజల్లో పాపులర్ అయితే ఆ పేరు తమ పక్కన ఉండాలని రకరకాల విద్యలను ప్రదర్శిస్తారు. బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా పేరును కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు అలాగే వాడుకుంటున్నారు. ప్రజా నాయకుడిగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న వంగవీటి రంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వారసత్వం పుచ్చుకున్న వంగవీటి రాధా కృష్ణ కూడా అంతే స్థాయిలో ప్రజా నాయకుడు అనిపించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

కానీ అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్లు తన నాన్న పేరును తాను వాడుకోలేకపోవడంతో ఇతర రాజకీయ పార్టీలు మాత్రం ఆసాంతం ఉపయోగించుకుంటున్నాయి.  వంగవీటి రంగా తమ నాయకుడు అంటే.. తమ నాయకుడు అంటున్నారే తప్ప.. ఆయన కుమారుడు రాధాకృష్ణ కు మాత్రం రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వడానికి ఏ పార్టీ ఒప్పుకోవడం లేదు. దీంతో వంగవీటి రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. అసలు వంగవీటి కుటుంబాన్ని రాజకీయ పార్టీలు ఎలా ఉపయోగించుకుంటున్నాయి..?

ఏపీ రాజకీయాల్లో కాపు ఓట్లు కీలకం. 18 శాతం వారి మద్దతుతోనే ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కాపులను మచ్చిక చేసుకునేందకు రాజకీయ పార్టీలు రకరకాల వ్యూహాలు పన్నుతూ ఉంటాయి. మరో ఏడాదిలో ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాపు సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కాపు రిజర్వేషన్ల అంశం లెవనేత్తారు.

ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు కాపు వర్గానికి చెందిన వంగవీటి రంగా.. మావోడే.. అని రాజకీయ నాయకులు అంటున్నారు. కాపు రిజర్వేషన్లపై ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా తాత్కాలికంగా అసెంబ్లీలో చర్చించి వదిలేస్తున్నారు. సీరియస్ గా ఈ విషయంపై దృష్టి పెట్టడం లేదు. దీంతో కాపులు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మరోసారి ఉద్యమం ఏర్పడే ప్రమాదం ఉన్నందున పార్టీలు అప్రమత్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో వంగవీటి రంగా పేరుతో పలు కార్యక్రమాలు చేస్తూ కాపులను మచ్చిక చేసుకుంటున్నారు. అయితే వంగవీటి రంగా పేరును వాడుకుంటున్న నాయకులు ఆయన కుమారుడు వంగవీటి రాధా కృష్ణకు మాత్రం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం వంగవీటి రాధా కృష్ణ బెజవాడ సెంటర్ నియోజకవర్గాన్ని కోరుకుంటున్నారు. అయితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మల్లాది విష్ణును పక్కన బెట్టి ఇవ్వలేదు. టీడీపీ బొండా ఉమను కాదనలేదు. ఒకవేళ వాళ్లను కాదని రాధాకు టికెట్ ఇస్తే గెలుస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది. వంగవీటి రాధను ఉపయోగించుకొని అన్ని పార్టీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. కానీ ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చే సాహసం చేయడానికి ఏ పార్టీ ముందుకు రావడం లేదు.

ఇదిలా ఉండగా వంగవీటి రంగా ఎమ్మెల్యేగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన కుమారుడు రాజకీయ స్థిరత్వం లేకుండా పార్టీలు మారుతూ వచ్చారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ప్రజారాజ్యం పార్టీకి మారారు. ఆ తరువాత వైసీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. టీడీపీలో ఆయనకు ఎమ్మెల్యీ కేటాయిస్తారని అనుకుంటున్నారు. అలా చేస్తే ఆయనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఎవరూ అనుకోరు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధ ఇప్పటికైనా సరైన నిర్ణయాలు తీసుకొని తన తండ్రిపేరును ఇతరులు వాడుకోకుండా చాకచక్యంగా వ్యవహరించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News