ఓ వైపు ప్రపంచం మొత్తం ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కరోనా వైరస్ తో యుద్ధం చేస్తోంది. ఇలాంటి సమయంలో దేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి వైరస్ ను అంతమొందించాల్సిన అవసరం ఉంది. పలు దేశాలు ఈ కోణంలో పనిచేస్తున్నాయి కూడా.
కానీ.. ప్రపంచ కుబేరుడిగా కీర్తిపొందిన బిల్ గేట్స్ మాత్రం.. ఇలాంటి కష్ట కాలంలో ఫక్తు వ్యాపారస్తుడిగా మాట్లాడడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. వ్యాక్సిన్ ఫార్ములాను భారత్ తో సహా.. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవద్దని ఆయన మాట్లాడటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. మేధోసంపత్తి హక్కుల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా అభివృద్ది చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్ ఫార్ములా ఇవ్వొద్దని అన్నట్టు సమాచారం. ఇలా వ్యాక్సిన్ ఫార్ములాను ఇవ్వడం అంటే.. మేథోసంపత్తి హక్కుల చట్టాన్ని ప్రశ్నార్థకం చేయడమేనని వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది.
తమ నైపుణ్యం, డబ్బు సక్సెస్ ఫుల్ ఫార్ములాలను తయారు చేస్తాయన్న బిల్ గేట్స్.. కరోనా వ్యాక్సిన్ అందరితోనూ పంచుకునే పేటెంట్ కాదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఆయన తీరుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలోనూ బిజినెస్ మెన్ గా వ్యవహరించారని మండిపడుతున్నారు.
మైక్రో సాఫ్ట్ ను తయారు చేసి ప్రపంచం మొత్తం అమ్ముకొని.. సొమ్ము చేసుకొని.. ప్రపంచంలోనే నెంబర్ వన్ కుబేరుడిగా వెలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. ప్రజల ప్రాణాలను హరిస్తున్న మహమ్మారిని కూడా అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదించాలనే వ్యక్తిగా మాట్లాడుతున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.