మొన్నటి వరకూ స్వైన్‌ఫ్లూ భయం హైదరాబాద్ నగర వాసులను వణించింది.. ఆ మూడ్ నుంచి ఇంకా బయటపడ్డారో లేదో ఇప్పుడప్పుడే బర్డ్ ఫ్లూ అలర్ట్‌లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ శివార్లలోని కోళ్ల ఫారంలో బర్డ్‌ఫ్లూ నిర్దారణ జరిగినట్టుగా తెలుస్తోంది. అక్కడ పనిచేసే ఒక వ్యక్తికి బర్డ్‌ఫ్లూ సోకినట్టుగా వైద్యులు నిర్దారణ చేశారు. ఈ అంశం గురించి కాస్త లోతుగా పరిశోధిస్తే కోళ్ల ఫారంలోని కోళ్ల నుంచి బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తోందని నిర్దారణ జరిగింది.
ఈ నేపథ్యంలో ఏకంగా కొన్ని వేల కోళ్లను చంపేయడానికే అధికారులు సిద్దం అయ్యారు. బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాపించకుండా దాదాపు 80 వేల కోళ్లను చంపేయాలని వారు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ను గుర్తించడంతోనే ఆ కోళ్లను చంపేయాలని వారు డిసైడ్ అయ్యారు. మంగళవారమే దానికి ముహూర్తమని తెలుస్తోంది.
మరి ఇది చికెన్ ప్రియులకు, కోళ్ల ఫారాల యజమానులకు శరాఘాతమే అని చెప్పవచ్చు. ఎక్కడ వ్యాధి సోకుతుందో అనే భయంతో చాలా మందికి చికెన్‌కు దూరం అయ్యే అవకాశం ఉంది... ఇది కోళ్ల ఫారాల యజమానుల్లో వణుకు పుట్టించే అంశమే!