ఇప్పుడు ఎవరి నోట విన్న.. ఒమిక్రాన్ మాటే. దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ తొలి కేసు నమోదైంది. దీని పట్ల ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. కాగా ఇప్పటికే 106 దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది. కాగా దీని పుట్టుకపై శాస్త్రవేత్తలు ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్నారు. తొలి కేసు నమోదైన నాటి నుంచి ఇప్పటివరకు అధ్యయనం చేస్తున్న కూడా ఒమిక్రాన్ పుట్టుక రహస్యం శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది.
నవంబర్ 24న దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్స్ లో తొలి కేసు నమోదైంది. మొత్తం 50 ఉత్పరివర్తనాలు కలిగి ఉన్న ఈ వైరస్... అక్కడ ఎలా పుట్టిందనే అంశంపై పరిశోధన చేస్తున్నారు. ఈ వేరియంట్ లో 30 స్పైక్ ప్రోటీన్ ఉన్నట్లు తేల్చారు. నెమ్మదిగా కరోనా ఆధిపత్య వేరియంట్ గా మారుతున్న ఈ వైరస్ పై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. మూడు రకాలుగా ఈ వేరియంట్ వ్యాపించి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. చాలాకాలంగా కరోనా తో బాధపడే వ్యక్తిలో ఈ వేరియంట్ ఉద్భవించి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నందున ఇలా రూపాంతరం చెందుతుందని అంటున్నారు. ఆరు నెలల పాటు కరోనాతో బాధపడుతున్న మహిళలు దీనిని గుర్తించినట్లు ఓ జర్నల్ ప్రచురించింది. పైగా ఆమె హెచ్ఐవి పాజిటివ్ ఉన్న మహిళ. ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని కనుగొన్నట్లు అందులో ప్రస్తావించారు.
ఇకపోతే 70 ఏళ్ల క్యాన్సర్ బాధితుడి లో ఇది నమోదైందని జర్నల్ లో ప్రచురించారు. 102 రోజుల తర్వాత అతను మరణించాడని పేర్కొన్నారు. కీమో థెరపీ, ప్లాస్మా, రెమిడిసివర్ వంటి వాటితో చికిత్స పొందుతున్న అతడు చివరకు మృతి చెందాడు. మరో బలహీనమైన 45 ఏళ్ల వ్యక్తిలోనూ 154 రోజుల పాటు కరోనాతో బాధపడ్డారు. అయితే ఈ విధంగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో వైరస్ అనేక రకాలుగా ఉత్పరివర్తనం చెంది... ఒమిక్రాన్ ఉద్భవించి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ అంశాలను నేచర్ జర్నల్ లో ప్రచురితం అయ్యాయి.
ఒమిక్రాన్ పుట్టుకకు రివర్స్ జూనోటిక్ ఈవెంట్ కూడా ఒక కారణమయ్యే అవకాశం ఉందని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే జంతువు నుంచి ఇది మనిషికి వ్యాపించి ఉండవచ్చని చెబుతున్నారు. అయితే ఎలుకల కారణంగానే ఒమిక్రాన్ ఉద్భవించే ఆస్కారం ఉందని అధ్యయనాల్లో పేర్కొన్నారు.
తక్కువ జన్యు శ్రేణి కలిగి ఉన్నవారికి ఒమిక్రాన్ పుట్టి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారిలో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని... వైరస్ రూపాంతరం చెంది ఉంటుందని చెబుతున్నారు. అయితే దక్షిణాఫ్రికా ప్రజల్లో ఇది తక్కువగా ఉంటుందని... అందుకే అక్కడ ఉద్భవించిందని చెబుతున్నారు. సౌతాఫ్రికా ప్రజలకు మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.
ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా ఒమిక్రాన్ పుట్టుక రహస్యం తేలడం లేదు. డెల్టా వేరియంట్ కంటే అతి వేగంగా ఇది వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెప్పారు. పరిస్థితి ఇలాగే ఉంటే దాదాపు అన్ని దేశాల్లోనూ ఒమిక్రాన్ కేసులు నమోదవుతాయని అంటున్నారు. కాగా ప్రపంచ దేశాలు ఈ మహమ్మారి కట్టడి చేయడానికి అప్రమత్తమయ్యాయి.