బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ కు చేదు అనుభవం ఎదురైంది. ముంబైలో అతడు ప్రయాణిస్తున్న కారును ఓ వ్యక్తి అడ్డుకున్నాడు. రైతులకు మద్దతు తెలపాలని అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
‘పంజాబ్ కు వ్యతిరేకంగా ఉన్న నువ్వు అక్కడి రైతులు పండించిన అన్నాన్ని ఎలా తినగలుగుతున్నావ్? కొంచెమైనా సిగ్గు అనిపించడం లేదా? సినిమాల్లో తలపాగా కడతావుగా.. సిగ్గుగా లేదా?’ అని మండిపడ్డారు.
అజయ్ దేవ్‌గన్ కారును 15 నిముషాల పాటు ఆపివేసిన వ్యక్తి, హీరో చేసిన ట్వీట్‌పై నిలదీశాడు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు హీరో అజయ్ దేవగణ్ మద్దతు ఇవ్వడం .. రిహన్న ట్వీట్ చేసిన తరువాత రైతుల నిరసనకు వ్యతిరేకంగా స్పందించాడు. అజయ్ దేవ్‌గన్ తన బీఎమ్‌డబ్ల్యూ కారు ముందు సీట్లో కూర్చుని ఉన్నాడు. ఈ సంఘటన ముంబై శివార్లలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీ వెలుపల జరిగింది.
రైతుల నిరసనకు అనుకూలంగా పాప్ ఐకాన్ రిహన్న ట్వీట్ పై ఇతర సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్, కరణ్ జోహార్, మరియు లతా మంగేష్కర్ల మాదిరిగానే అజయ్ దేవగన్ కూడా ట్వీట్ చేశాడు. హ్యాష్‌ట్యాగ్‌లతో విదేశీ ప్రముఖులను తప్పు పట్టారు. రైతుల నిరసనకు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు.
“భారతదేశం లేదా భారతీయ విధానాలకు వ్యతిరేకంగా ఏదైనా తప్పుడు ప్రచారం కోసం వాడుకోకండి.. ఏదైనా గొడవలు సహజం.. ఐక్యంగా నిలబడటం చాలా ముఖ్యం ”అజయ్ దేవ్‌గన్ గతంలో రైతులకు వ్యతిరేకంగా ట్వీట్ చేశాడు.
ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.