నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని సాధారణంగా చాలా మంది అంటుంటారు. నాలెడ్జ్ ఈజ్ నేషన్ అని ఉంటే పశ్చిమ బెంగాల్ బీజేపీ కార్యకర్తలు వాళ్లు చేసిన పొరపాటు పనికి చింతించవలసిన అవసరం ఏర్పడి ఉండేది. భారత్ పై చైనా దుశ్చర్యకు ఆగ్రహించిన కమల దళ సభ్యులు పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ లో ఉత్తర కొరియా లీడర్ కిమ్ జోంగ్ ఉన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
అసలు ఆయన దిష్టిబొమ్మను ఎందుకు తగలబెడుతున్నారు? అని అక్కడున్న వాళ్లెవరో అడిగితే, మన సైనికులను చంపించింది ఆయనే. చైనా ప్రధాని అన్నారు. కిమ్ నే వాళ్లు జిన్ పింగ్ అనుకున్నారు. జిన్ పింగ్ ని కూడా వాళ్లు అధ్యక్షుడు అనుకోలేదు. ప్రధాని అనుకున్నారు. మారింది దిష్టి బొమ్మలే కాబట్టి పెద్ద ప్రమాదమేం లేదు. ఇద్దరు లీడర్ ల ముఖాలూ గుండ్రంగా ఉంటాయి కనుక పొరపడి ఉండొచ్చు. ఏమైనా పోల్చుకోలేక పోవడం నాలెడ్జ్ లేకపోవడమైతే కాదు. చైనా అంటున్నారంటే వారికీ కొంచెం క్లారిటీ ఉన్నట్లే. ఆగ్రహంలో జెన్యూనిటీ ఉన్నట్లే. నేషన్ ఈజ్ నాలెడ్జ్.