తెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించేందుకు అన్ని రకాల అవకాశాలను బీజేపీ అందిపుచ్చుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని.. అధికారంలోకి రావాలని.. ఇప్పటికే పదే పదే చెబుతున్న కమల నాథులు.. దానికి అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త వ్యూహానికి తెరదీశారు.
ఏకంగా.. ఏడాది పాటు.. తెలంగాణ విమోచన(బీజేపీ నేతలు విముక్తి అని పేరు మార్చారు) దినోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే సెప్టెంబర్ 17 నుంచి తెలంగాణ విముక్తి వేడుకలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
బీజేపీ రాష్ట్ర నాయకత్వం సెప్టెంబర్ 17ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ విమోచనదినం అని కాకుండా తెలంగాణ విముక్తి దినోత్సవమని పిలవాలని నిర్ణయించింది. ఈ సెప్టెంబర్ 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17వరకు తెలంగాణ విముక్తి వేడుకలు నిర్వహించాలని భావిస్తోంది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలపి 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఏడాది పాటు ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
వచ్చే ఏడాది సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని కమలనాథులు నిర్ణయించారు. అజాదీ కా అమృత్ మహోత్సవం తరహాలో తెలంగాణ విముక్తి ఉత్సవాలు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఆ సమయంలో నెలకొన్న సామాజిక, రాజకీయ, చారిత్రక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని వాటికి.. జాతీయ నాయకులను ఆహ్వానించాలని యోచిస్తోంది.
అయితే.. ఈ వ్యూహం వెనుక పక్కా రాజకీయం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలు అదే ఏడాది నిర్వహించే అవకాశం ఉండడం.. ప్రజలను మరింత సెంటిమెంటుతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించడం వంటివి చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే .. బీజేపీ వ్యూహం వెనుక రాజకీయ చతురత.. పక్కా ప్లాన్ ఉందని అంటున్నారు. వాస్తవానికి విమోచన దినాన్ని.. నిర్వహించాలని.. బీజేపీ నాయకులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.
అయితే.. కేసీఆర్ సర్కారు మాత్రం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విమోచన దినానికి విముక్తి దినంగా పేరు పెట్టి బీజేపీ ప్రజల్లోకి వెళ్లడం.. రాజకీయంగా సరికొత్త అడుగేనని అంటున్నారు పరిశీలకులు.