ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అన్నింటికంటే ఆసక్తికరమైన, ప్రజలంతా హర్షించిన సందర్భం... పార్టీలకు అతీతంగా - శాసనమండలి-శాసనసభా అనే తేడాలేకుండా విభజిత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం. అయితే, తీర్మానం చేయడమో - దాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతోనే ఆకాంక్షలు నెరవేరుతాయా? నిధుల వరద పారుతుందా? అంటే కానేకాదు అనేది అందరికీ తెలిసిందే. అందుకే తీర్మానం ఓకే కానీ వాట్ నెక్ట్స్ అనేది ఇపుడు సర్వత్రా వినిపిస్తున్న చర్చ!
ఏపీ ప్రజల ఆకాంక్షల కోణంలో పార్టీలన్నీ తీర్మానానికే పరిమితం కాకుండా అంతా కలిసి ఈ డిమాండ్ లపై కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వస్తేనే ఐక్యత స్పష్టమవుతుంది. అలా కాని పక్షంలో ఇది ఒక మొక్కుబడి వ్యవహారంగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఇంతవరకూ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నాయకులు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటుండటాన్ని కేంద్రం అలుసుగా తీసుకుంటూ వస్తోంది. రాజ్యసభలో జరిగిన చర్చే ఇందుకు ఉదాహరణ. పెద్దల సభలో రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల ఎంపీలు పరస్పరం ఆరోపించుకోవడాన్ని ఆసరాగా చేసుకునే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎదురుదాడి చేశారు. ఆనాడు కాంగ్రెస్ పకడ్బందిగా చట్టం చేయకపోవడం వల్లే ప్రత్యేక హోదా ప్రకటనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ పాతపాట పాడారు. కాంగ్రెస్ తీసుకుని వచ్చిన విభజన చట్టాన్ని యథాతథంగా ఆనాడు బీజేపీ ఆమోదించడమే కాకుండా, తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాని ఐదు ఏళ్ళు కాదు, పదేళ్ళు అమలుజరుపుతామని వెంకయ్యనాయుడే సభాముఖంగా ప్రకటించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ తాము తుచ తప్పకుండా అమలుజేస్తామని ఆయనే కాదు, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇప్పుడు కూడా సభా ముఖంగా ప్రకటించారు. కానీ ఇపుడు నిబంధనలు గట్రా చెప్పేస్తున్నారు. దీనికి కారణం అంతా కలిసి గట్టిగా నిలదీయలేరనే బలమైన నమ్మకం కాక మరేమీ కాదు!!
మరోవైపు ఏపీ కోసం కాంగ్రెస్ ఇప్పుడు తెస్తున్న ఒత్తిడి రాజకీయ ప్రయోజనం కోసమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ తన అస్తిత్వం కోసం ఢిల్లీ యాత్రలూ - ఉద్యమాలు వంటి ఆందోళనా కార్యక్రమాలను చేపట్టడం తప్పేమీ లేదు. ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ కి ఆ హక్కు ఉంది. విభజనపై నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా, ఆ నిర్ణయాన్ని సమర్ధించిన మిగతా రాజకీయ పార్టీలు తమ వంతు పాపాన్ని చెరిపేసుకోలేవు. ఎదురుదాడి వల్ల ఎల్లకాలం ప్రజలను నమ్మించగలమని అనుకుంటే ఆ పార్టీలు భంగ పడకతప్పదు. విభజనకు సమ్మతి లేఖలు ఇచ్చిన పార్టీలకు కూడా విభజనలో భాగస్వామ్యం ఉంది. అందువల్ల పదే పదే కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోసి చేతులు దులిపేసుకుందామనుకుంటే ఎల్లకాలం సాగదు.
క్షేత్రస్థాయిలో చూస్తే...రాష్ట్రవిభజన జరిగి రెండేళ్ళు పూర్తి కావస్తోంది. ప్రత్యేక హోదా కన్నా, ఎక్కువ సాయాన్ని రాష్ట్రానికి అందిస్తామంటూ కేంద్ర మంత్రులు ఊదరగొడుతున్నారు. కేంద్రం నుంచి ఇంతవరకూ ఏ మేరకు నిధులు విడుదలయ్యాయో రాజమహేంద్రవరంలో జరిగిన సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఏకరవుపెట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఘంటాపథంగా చెప్పారు. కానీ, బడ్జెట్ లో సరైన కేటాయింపులు లేకుండా ఆ ప్రాజెక్టును కేంద్రం ఎలా పూర్తి చేయగలదన్న సందేహాలు ప్రజల్లో ఏర్పడటం సహజం. ప్రత్యేక హోదాతో పాటు బాగా వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ - ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్యాకేజీలు ఇస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ మరుగున పడిపోయింది.
ఇం ఈ రెండేళ్ళలో ఉన్నత విద్యా సంస్థలెన్నింటినో తెరిచామని కేంద్రం ప్రకటించుకోవడం సరికాదనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ సంస్థలు తెరిచినంత మాత్రాన సరిపోదు. వాటికి నిధులు సమకూర్చాలి. సరైన వసతి సౌకర్యాలు కల్పించాలి. అధ్యాపకులు - వైస్ చాన్సలర్లు - బోధనేతర సిబ్బందిని నియమించాలి. అన్ని హంగులు ఒక్కరోజులో ఏర్పడవన్న సంగతి నిజమే కానీ, కనీసం ఆ విద్యాసంస్థలు పనిచేయడానికి అనువైన కనీసవసతులు కల్పించడం కేంద్రం బాధ్యత.
రాజధానికి భూ సమీకరణ విషయంలో సీఎం చంద్రబాబు - ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ల మధ్య సాగుతున్న ఆరోపణల యుద్ధంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావల్సిన నిధులు - ప్రత్యేక హోదా మొదలైనవి మరుగున పడిపోతున్నాయి. ఒకరి అవినీతి గురించి మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ప్రత్యేక హోదా వల్ల ఒనగూరే ప్రయోజనాలు బాగా పరిమితమని సన్నాయి నొక్కులు ప్రారంభించిన కేంద్ర మంత్రులూ - బీజేపీ నాయకులు ప్రత్యేక సాయం (ప్యాకేజీ ) గురించి మాట్లాడటం లేదు. అందుకే ఏపీ ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చాలనుకునే వారంత ఇపుడు పార్టీలకు అతీతంగా ఏకం కావాలి. ఏకగ్రీవ తీర్మానం సమయంలో చూపిన చొరవనే ప్రదర్శించి కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అపుడే హామీలు అమలు రూపం దాల్చేందుకు అవకాశం ఉంటుంది.