ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు అంటూ కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ను ఇటీవలే సీబీఐ , ఈడీ వర్గాలు అరెస్టు చేశాయి. అయితే ఎక్కువ కాలం ఆయనను జైల్లో ఉంచలేకపోయారు. తీహార్ జైలు వరకూ తరలించినా.. ఆ తర్వాత మాత్రం కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేయక తప్పలేదు. అలా మళ్లీ బెంగళూరు చేరుకున్నాడు డీకే శివకుమార్.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతి తక్కువ మంది ట్రబుల్ షూటర్లలో డీకే శివకుమార్ ఒకరు. ఇలా భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు ఆయన. ఈ క్రమంలో కర్ణాటకలో డీకే శివకుమార్ భారతీయ జనతా పార్టీకి ఆగ్రహం తెప్పించే పని మరోటి చేపట్టారు. అదేమిటంటే.. భారీ ఏసుక్రీస్తు విగ్రహం ఏర్పాటు!
ప్రపంచంలోనే అతి పెద్ద ఏసుక్రీస్తు విగ్రహాన్ని నెలకొల్పడానికి డీకే శివకుమార్ రెడీ అవుతున్నారట. ఏకంగా 114 అడుగుల ఎత్తు ఏసు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారట. అది తను ప్రాతినిధ్యం వహిస్తున్న కనకపుర నియోజకవర్గం పరిధిలోనే అని డీకేశి ప్రకటించారు. అందుకు తన వ్యక్తిగత భూమిని కేటాయిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన భారతీయ జనతా పార్టీ వారికి ఆగ్రహాన్నే కలిగించినట్టుగా ఉంది.
డీకే శివకుమార్ తన సొంత భూమిని క్రీస్తు విగ్రహానికి ఇస్తున్నట్టుగా ప్రకటించిన నేపథ్యంలో.. ఆ భూమి చరిత్రను తవ్వితీస్తోందట ప్రభుత్వం. ఆ భూమి డీకే శివకుమార్ ది కాదు అని, అది సామాజిక అవసరాలకు ప్రభుత్వం తీసి పెట్టగా..దాన్ని ఆయన కొనుగోలు చేసినట్టుగా చూపుతున్నారని.. అది వివాదాస్పద భూమి అని ప్రభుత్వం వాదిస్తూ ఉంది. మరి ఈ వివాదం ఎంత వరకూ వెళ్తుందో!