గతంలో మధ్యప్రదేశ్, మొన్న మహారాష్ట్ర.. నేడు జార్ఖండ్.. కాదేదీ కూల్చడానికి అనర్హం అన్నట్టుగా బీజేపీ చెలరేగిపోతోంది. ఒక్కో రాష్ట్రాన్ని బీజేపీ హస్తగతం చేసుకునేందుకు వేయని ప్లాన్ లేదు. ఇటీవలే మహారాష్ట్రలో కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన సర్కార్ ను దిగ్విజయంగా కూల్చిన బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
బీజేపీ ఇలా ప్రాంతీయ పార్టీల రాష్ట్రాలను కూల్చడం అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఐదారు రాష్ట్రాలు బీజేపీ వశమయ్యాయి. తాజాగా జార్ఖండ్ లోనూ ఆట మొదలుపెట్టేసింది. ఆరాష్ట్ర సీఎం ఎమ్మెల్యే సీటుకు ఎసరు తెచ్చింది. ఎమ్మెల్యేలను లాగేయడానికి రెడీ అయ్యిందట..
ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో మరో మూడు రాష్ట్రాల్లో బీజేపీ పాలన కోసం అక్కడి ప్రభుత్వాలను కూల్చడానికి రెడీ అయ్యిందని.. అందులో ఢిల్లీ కూడా ఉందని ఆరోపించారు. ఇటీవల మనీష్ సిసోడియాకు అందుకే ఆఫర్ ఇచ్చారని.. వినకపోవడంతో సీబీఐ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
దేశంలోని ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ నిధులన్నీ ఉపయోగిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇప్పటివరకూ బీజేపీ 277 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని.. ఒక్కొక్కరికి రూ.20 కోట్లు చొప్పున మొత్తం రూ.5500 కోట్లు ఖర్చు చేసి ఉంటుందని అన్నారు. జీఎస్టీ, ఇంధన ధరల పెంపుతో వచ్చిన డబ్బును ఇలా ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ఉపయోగిస్తోందని.. అందుకే దేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడిందని అన్నారు.
ఇటీవల ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం తనను బీజేపీలోకి రావాలని ఆఫర్ ఇచ్చారని.. వస్తే సీఎంను చేస్తామన్నారని.. ఆ ఆడియో కూడా తన వద్ద ఉందని సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ రైట్ హ్యాండ్ అయిన సిసోడియా నమ్మిన సిద్ధాంతాల కోసం పార్టీ మారనని చెప్పినట్లు వెల్లడించారు. ఇలా బెండ్ అయిన ప్రతీ ఒక్కరిని డబ్బుతో పరపతితో.. లేదంటే కేసులతో భయపెట్టి బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంటోందని.. ఇందుకోసం అనైతిక చర్యలకు పాల్పడుతోందని అర్థమవుతోంది. కేజ్రీవాల్ సైతం ఇదే ఆరోపణలు చేశారు. బీజేపీ డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేలను కొంటోందని ఆరోపించారు.