రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అంటారు. చంద్రబాబు ఈ సూత్రాన్ని నూటికి నూరు శాతం అనుసరిస్తారు. ఆయనకు నచ్చక పోతే దూరం జరుగుతారు. నచ్చితే మళ్లీ దగ్గర చేరేందుకు ఆరాటపడతారు. టీడీపీని తన చేతుల్లోకి తీసుకున్నాక చంద్రబాబు మార్క్ రాజకీయ విన్యాసం అంతా ఇలాగే చూస్తూ వస్తున్నారు. ఆయన గత పాతికేళ్లలో ఎన్నో పార్టీల తో పొత్తులు పెట్టుకున్నారు, వారిని భుజన ఎత్తుకున్నారు, సడెన్ గా దించేశారు కూడా. అయితే అన్ని రోజులూ ఒక్కలా ఉండవని అంటారు. వాజ్ పేయ్, అద్వానీ నాయకత్వాన బీజేపీ ఉన్నప్పటి రోజులు కావు ఇవి. అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ, అమిత్ షా. వారిద్దరూ అన్నీ చూస్తారు, గతం గతహా అని అసలు వదిలేయరు. ఇపుడు ఇదే చంద్రబాబు ని బీజేపీకి దూరం చేస్తోంది అంటే తప్పు లేదేమో.
చంద్రబాబు మీద మొదటి నుంచి మోడీ కి పెద్దగా నమ్మకం లేదని అంటారు. 2014 ఎన్నికల వేళ కూడా ఏపీ లో పొత్తులకు సుముఖం వ్యక్తం చేయలేదు. అయితే నాడు ఏపీ కి చెందిన బీజేపీ పెద్దాయన చక్రం తిప్పి ఈ పొత్తు కుదిర్చారు అని ప్రచారం జరిగింది. ఆ తరువాత నాలుగేళ్ల పాటు మోడీ బాబుల మధ్య అనుమానంగానే స్నేహం సాగింది. ఇక 2018 నాటికి ఆ బంధం తెగిపోయింది. దానికి చంద్రబాబు తొందర పాటుతనమే కారణం అని అంటారు. మొత్తానికి బీజేపీ తో రాం రాం అనేసి చంద్రబాబు ఊరుకోలేదు, దేశమంతా తిరిగి మోడీ ని ఓడించాలని ప్రచారం చేశారు. బీజేపీ బద్ధ శత్రువు కాంగ్రెస్ తో చేతులు కలిపారు. సరిగ్గా ఇక్కడే మోడీ షా హర్ట్ అయ్యారని అంటారు.
అందుకే తాజాగా బాబు ఢిల్లీ టూర్ లో అపాయింట్మెంట్లు దొరకలేదు అన్న మాట ఉంది. అంతే కాదు, ఏపీకి మోడీ వచ్చినపుడు నల్ల జెండాలతో నిరసన తెలపడం, అమిత్ షా కారు మీద రాళ్ళను వేయించడం వంటి ఘటనలు కూడా వారు అసలు మరచిపోలేదు అని అంటారు. మొత్తానికి ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. మోడీ షాల నాయకత్వం కింద బీజేపీ ఉన్నంతవరకూ టీడీపీ తో పొత్తులు బంధాలు ఉండవని. అందుకే రెండు రోజుల పాటు ఢిల్లీ లో ఉండి కూడా అపాయింట్మెంట్ దక్కక టీడీపీ అధినాయకుడు నిరాశ పడాల్సి వచ్చిందని అంటున్నారు.
నిజానికి మంచి స్కెచ్ వేసుకునే చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్లాన్ చేశారు. మోడీ షా ల అపాయింట్మెంట్ దక్కితే ఏపీ లో వైసీపీ పని అయిపోయింది అని చెప్పాలనుకున్నారు. కనీసం అమిత్ షా అపాయింట్మెంట్ దక్కినా ఏపీ లో తమ రాజకీయ కధ రసకందాయంలో పడుతుందని ఆశించారు. అయితే అక్కడ నుంచి పాజిటివ్ గా రెస్పాన్స్ రాకపోవడం తో టీడీపీ కి భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. ఈ మొత్తం ఎపిసోడ్ లో చూస్తే చేసుకున్న వారికి చేసుకున్నంత అన్న సామెత గుర్తు కు వస్తుంది. బాబు ఫ్లాష్ బ్యాక్ లో చేసిన తప్పులే ఇపుడు చిక్కులు తెస్తున్నాయి.