మహారాష్ట్ర లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు లో కీలకంగా మారిన ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కొద్దిసేపటి క్రితమే వైదొలిగారు. ఈ మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీకి గుడ్ బై చెప్పారు. దీంతో మహారాష్ట్రలో బీజేపీ సర్కారు పరిస్థితి దిగజారింది.
ఇక అజిత్ పవార్ వైదొలగడంతో మహారాష్ట్ర లో బీజేపీ సర్కారు నిలబడడం కష్టమేనన్న అంచనాలకు బీజేపీ వచ్చేసినట్టుంది. తాజాగా బీజేపీ కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర లో బీజేపీ కి ఇప్పటికిప్పుడు బలనిరూపణకు సరిపడా మెజార్టీ లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. అజిత్ పవార్ ను నమ్ముకున్నామని.. ఎమ్మెల్యేలంతా అజిత్ పవార్ వెంట వస్తారని బలపరీక్షలో నెగ్గుతామని అనుకున్నామని.. కానీ ఆయనే వైదొలగడంతో ఇక మహారాష్ట్ర లో బీజేపీ నెగ్గడం కష్టమేనని కేంద్రమంత్రి రామ్ దాస్ హాట్ కామెంట్స్ చేశారు.
దీంతో మహారాష్ట్ర లో ఇక బీజేపీ సర్కారు నిలబడుతుందన్న ఆశ ఆ పార్టీ శ్రేణుల్లో చచ్చిపోయింది. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై ప్రధాని మోడీతో అమిత్ షా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా చర్చిస్తున్నారు. మహారాష్ట్ర పై బీజేపీ ఆశలు వదిలేసుకుందని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి రామ్ దాస్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.