గోవా ముఖ్యమంత్రి - సీనియర్ బీజేపీ నాయకుడు మనోహార్ పారికర్ మరోమారు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. `మనదేశం' లోని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా నుంచి పరిపాలన చేస్తున్నారు. ఇలా ఒక రోజు కాదు ఏకంగా ఆరు వారాల పాటు ఈ పాలన కొనసాగుతోంది. ఆయన ఎవరంటే...గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్` అంటూ కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలా గైర్హాజరుతో వైరల్ అయినా పారికర్ తాజాగా పరిపాలనపరమైన అంశాలతో హాట్ టాపిక్‌గా మారారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఆయన పాలనలో బిజీగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
62 ఏళ్ల పారికర్ కొన్నాళ్లుగా ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతూ ఫిబ్రవరి15వ తేదీన ఆయన ముంబై హాస్పటల్ లో చేరారు. ముంబైలోని లీలావతి హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కొన్ని గంటల్లోనే ఆయన పనాజీ చేరుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే, బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కొన్ని రోజులకు ఆయనకు ఆరోగ్య సమస్యలు మళ్లీ ఎదురయ్యాయి, దీంతో మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లారు. అయితే అమెరికాకు వెళ్లే ముందు ఆయన తన మంత్రి వర్గ సహచరుల్లో ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు. తిరిగి వచ్చిన తదుపరి ఆయన పరిపాలనలో బిజీ అయిపోయారు. అలా పరిపాలనలో బిజీగా ఉన్న సమయంలో ఆయన ఫోటో ఒకటి మీడియాకు విడుదలైంది. తీవ్ర అనారోగ్యం పాలైనప్పటికీ పరిపాలన వ్యవహారాల్లో బిజీగా ఉన్న ఆయన చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పలువురిని ఆకట్టుకుంటోంది.