భారతీయ జనతాపార్టీలో జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇది. బీజేపీకి ఎదురుగాలి వీస్తుందని ఎంత చర్చ జరుగుతుందో...అంతకు రెట్టింపుగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎంపీల వల్ల బీజేపీకి దెబ్బ పడటం ఖాయమనే చర్చ కూడా అంతే స్థాయిలో జరుగుతోంది. పైగా కేంద్రంలో అధికారం అందుకోవడంలో కీలక ప్రభావం చూపే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి సొంతింటి నుంచే ఎదురుగాలి వీస్తోందని అంటున్నారు. రాజకీయ పార్టీలు ముఖ్యమైన ఓటుబ్యాంకుగా పరిగణించే దళితవర్గాల నుంచి అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తమ పార్టీలోని దళిత ఎంపీల నుంచే బీజేపీకి అసమ్మతి ఎదురవుతుండటం ఈ చర్చకు కారణం.
రాజ్యాంగం తమకు కల్పించిన రిజర్వేషన్లను హరించేందుకు - ఎస్సీఎస్టీల చట్టాన్ని నీరుగార్చేందుకు బీజేపీ పాలనలో ప్రయత్నాలు జరుగుతున్నాయని దళితసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై ఇటు ప్రతిపక్షాలు ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ సర్కారును దుయ్యబడుతున్నాయి. ఈ తరుణంలో యూపీలోని సొంత ఎంపీలే కేంద్ర - రాష్ట ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం ఆ పార్టీలో అసమ్మతి ముసలం పుట్టిందనడానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో ఏడాదిలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు బీజేపీ విజయావకాశాలను దెబ్బతీస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొందరు బీజేపీ ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - యూపీ సీఎం యోగీ సర్కార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎంపీలు వారితో జత కలిశారు.
ఎస్సీ - ఎస్టీల చట్టం విషయమై సుప్రీంకోర్టు ఆదేశాలపై దేశవ్యాప్తంగా నిరసలు వెల్లువెత్తినప్పటి నుంచి ఇటావా ఎంపీ అశోక్ కుమార్ దోహ్రీ - నగీనా ఎంపీ యశ్వంత్ సింగ్ ప్రధాని మోడీ తీరుపై తమ అసంతృప్తిని బాహాటంగా వెలిబుచ్చుతున్నారు. రిజర్వేషన్ల పరిరక్షణ కోరుతూ ఆందోళనలు చేసిన వారిపై పోలీసులు బూటకపు కేసులు పెడుతున్నారని దోహ్రీ ఆరోపించారు. దీని వల్ల దళితుల్లో అభద్రతాభావం పెరుగుతున్నదని తెలుపుతూ ప్రధానిపై లేఖాస్త్రం సంధించారు. ఇక ఎంపీ యశ్వంత్ సింగ్ నేరుగానే ప్రధాని మోడీ పాలనను దుయ్యబట్టారు. గత నాలుగేళ్లలో ప్రజల కోసం మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేదని పేర్కొన్నారు. తన వంటి దళితులు ఎంపీలుగా ఉండి కూడా ఎస్సీల సమస్యలను తీర్చలేకపోతున్నామని, న్యాయపరమైన పలు నిర్ణయాలు దళితుల హక్కులను హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు కల్పించాలని - ఎస్సీల సంక్షేమానికి మరిన్ని చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఇద్దరి కంటే ముందు రాబర్ట్స్‌గంజ్ ఎంపీ చోటేలాల్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీరుపై మోడీకి ఫిర్యాదు చేశారు. యోగిని కలువడానికి వెళితే ఆయన సిబ్బంది తనను గల్లా పట్టుకుని బయటికి ఈడ్చారని తెలుపుతూ ప్రధానికి లేఖ రాశారు. ఇక మరో దళిత ఎంపీ సావిత్రిబాయి ఫూలే తిరుగుబాటు బాట పట్టారు. ఎస్సీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించడానికి - రిజర్వేషన్ల రద్దుకు మోదీ పాలనలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్రస్థాయిలో ఆరోపించి సంచలనం సృష్టించారామె. బీజేపీపై ఆమె తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఆ పార్టీని వీడి మాయావతి నాయకత్వంలోని బీఎస్పీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు, శనివారం సీఎం యోగి న్యూఢిల్లీలో ప్రధాని మోడీతో సమావేశమై ఎంపీ చోటేలాల్ ఫిర్యాదుతోపాటు పార్టీలోని ఇతర ఎంపీల అసమ్మతిపై చర్చించినట్లు తెలిసింది.
ఈ పరిణామాలన్నీ బీజేపీలో కలవరానకిఇ దారిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే...దేశంలోని మిగతా రాష్ర్టాల్లో కంటె యూపీలోనే అత్యధిక సంఖ్యలో 80 లోక్ సభ సీట్లున్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఎంపీ స్థానాలను పొందిన పార్టీకి కేంద్రంలో అధికారం లభించడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. యూపీలో ఎస్సీల జనాభా ఎక్కువ కాబట్టి వారి మద్దతు ఉంటేనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. బీజేపీ గత ఎన్నికల్లో మొత్తం 80 సీట్లలో 71 స్థానాలను గెలుచుకుంది. వాటిలో 17 ఎస్సీ రిజర్వుడ్ సీట్లుండగా వాటన్నింటినీ దక్కించుకున్నది. కానీ వచ్చే ఎన్నికల్లో ఇలా జరిగేట్లు పరిస్థితి కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. సొంత పార్టీలోని దళిత ఎంపీలే పార్టీని - కేంద్ర - రాష్ట్ర సర్కార్ల పనితీరును తప్పుపట్టడం రానున్న ఎన్నికల్లో ఆ పార్టీపై పెనుప్రభావం చూపుతుందని వారు పేర్కొంటున్నారు. ఒకవైపు యూపీలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో బీఎస్పీ - ఎస్పీ పార్టీలు కలిసి పనిచేసి బీజేపీని మట్టికరిపించాయి. ప్రతిపక్షాలు ఏకమైతే బీజేపీ తుడిచిపెట్ట్టుకుపోతుందని నిరూపించాయి. మరోవైపు ప్రాంతీయపార్టీలు , ప్రతిపక్షాలు కలిసి జాతీయస్థాయిలో కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కమలం పార్టీ హవా ఇక ముందు కొనసాగే అవకాశాలు లేవని ఈ పరిణామాలు సూచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.