సయ్యద్ షెహజాదీ.. ఇప్పుడు బీజేపీ అస్త్రంగా మారింది. పాతబస్తీలో బలమైన పునాదులుండి దాదాపు ఆరేడు దశాబ్ధాలుగా ఆదిపత్యం చెలాయిస్తున్న ఎంఐఎంకు గట్టి షాక్ ఇచ్చేందుకు బీజేపీ రంగంలోకి దించింది. ఏకంగా ఎంఐఎం శాసనసభా పక్ష నేత అకర్బుద్దీన్ ఓవైసీ మీద ఈమెను పోటీకి దింపింది బీజేపీ. హైదరాబాద్ లోని అక్బరుద్దీన్ పోటీచేసే చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సయ్యద్ హెహజాదీ బరిలోకి దిగుతోంది.
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఈమె రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో స్టూడెంట్ లీడర్ గా చేరారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యూయేట్ చదివేటప్పుడు ఏబీవీపీలో చేరారు. ప్రస్తుతం ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. ఈమె పాతబస్తీలోని ముస్లిం మహిళల సమస్యలు - స్థితిగతులపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. బోనాలు - గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఓవైసీ కుటుంబాన్ని టార్గెట్ చేసి పాతబస్తీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పాతబస్తీలో ఎంఐఎంను వ్యతిరేకిస్తున్న ముస్లిం బస్తీల్లోకి షెహజాదీ వెళ్లి ప్రజల మనసులను దోచుకున్నారు.
అకర్బుద్దీన్ టార్గెట్ గా హెహజాదీ పదునైన విమర్శలు చేస్తున్నారు.. ‘అక్బరుద్దీన్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచారు. పాతబస్తీ ముస్లింల జీవితాల్లో ఏం మార్పు తీసుకొచ్చారు.. పిల్లలకు నాణ్యమైన విద్యనందించావా? అసలు నీ హయాంలో ఎంతమంది ముస్లింలు డాక్టర్లు - ఇంజనీర్లు అయ్యారు.? ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించావు’ అంటూ పాతబస్తీల్లో ఎంఐఎంను ఢీకొంటున్నారు.
బీజేపీ ఒక ముస్లిం అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిందని.. బీజేపీలో ముస్లిం నాయకులు సికిందర్ భక్త్, నజ్మా హెప్తుల్లా.. ఎంఎం అక్బర్ లు ఉన్నత స్థానాలు అధిరోహించారని ఆమె ముస్లింలపై బీజేపీకి ఉన్న వ్యతిరేకతను పారదోలుతున్నారు. తను కడు పేదరికమైన ముస్లిం యువతిని అని .. ఆర్థికంగా లేకున్నప్పటికీ బీజేపీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు.
ఎంఐఎం అధికార దుర్వినియోగం.. పేద ముస్లింలను ఎలా దోచుకుంటున్నది వివరించేందుకు షెహజాదిని అక్బరుద్దీన్ పై పోటీకి దింపినట్లు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆమె అక్బరుద్దీన్ పై పోటీచేయాలని ఆసక్తితో ఉన్నారని అందుకే టికెట్ కేటాయించాలని కోరుతున్నామన్నారు.