తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ సీరియస్ గా ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇప్పటికే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటి ద్వారా ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు ఇతర పార్టీల్లోని ముఖ్య నాయకులను చేర్చుకుంటోంది. ఓ వైపు ఖమ్మం జిల్లాను కైవం చేసుకునేందుకు బీఆర్ఎస్ తొలి సభను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉన్న ఈ సభతో ఇటు తెలంగాణ, ఆంధ్రాప్రాంతాను ప్రభావితం చేయొచ్చని గులాబీ బాస్ కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సైతం ఖమ్మంతో పాటు వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు.
ఆ పార్టీలోని ముఖ్యులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక దాదాపు కన్ఫామ్ అయింది. ఆయనతో పాటు మరికొందరు ముఖ్య నేతలను కూడా తీసుకురానున్నారు.అటు వరంగల్ జిల్లాలోనూ అదే పరిస్థితి.
తెలంగాణ సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కు కలిసి రావడం లేదు. ఈ జిల్లా నుంచి బీఆర్ఎస్ కు ఓకే ఒక్క సీటు దక్కుతూ వస్తోంది. ఇక సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్ని కారణాల వల్ల కారు పార్టీని వీడాల్సి వస్తోంది. ఈనెల 18న ఆయన అమిత్ షా తో భేటీ అయి కాషాయ కండువా కప్పుకోనున్నారు. పొంగులేటితో పాటు ఎంత మంది నేతలు వెళ్తారన్నది ఆసక్తిగా మారింది. ఖమ్మం మొదటి నుంచి కమ్యూనిస్టుల కంచుకోట. కానీ ఇక్కడ కాషాయ జెండా ఎగరేయాలని ఇతర నాయకులను సంప్రదిస్తున్న ట్లు సమాచారం. బీఆర్ఎస్ లోని అసంతృప్తులతో పాటు కాంగ్రెస్ కు చెందిన నాయకులను చేర్చుకోవాలని చూస్తున్నారు.
అటు వరంగల్ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ కు చెందిన ఓ నేతతో పాటు కాంగ్రెస్ పార్టీలోని ముగ్గురు ముఖ్య నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. వీరిలో అధికార పార్టీకి చెందిన నేత జాయిన్ అయితే మిగతా ముగ్గురికి ఆఫర్ ప్రకటించి చేర్చుకోవాలని చూస్తున్నారు. అయితే వరంగల్ జిల్లాలో బీజేపీ తరుపున బలమైన నేత లేరు. అందువల్ల ఇతర పార్టీలోని ముఖ్యనేతలను తీసుకొస్తే ప్రయోజనం ఉంటుందని ఆలోచిస్తున్నారు.
ఖమ్మం, వరంగల్ తో పాటు ఇతర జిల్లాలోని ఇదే వ్యూహాన్ని రచించనున్నారు. ఇప్పుడున్న బీజేపీ నాయకులతో పాటు ఇతర పార్టీల్లోని గెలుపు గుర్రాలకు అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు. బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చని వ్యక్తులకు ప్రాధాన్యం ఉండదని అంటారు. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఆ సాంప్రదాయాన్ని పక్కనబెట్టనున్నారు. అయితే ఎన్నికల సమయానికి పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తిగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.