టీడీపీ..బీజేపీ మధ్య మాటల యుద్ధంలో మరో అంకం మొదలైంది. అదే పనిగా తమను తిట్టి పోస్తున్న టీడీపీ నేతలపై బీజేపీ నేతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తిట్ల దండకంలో తిట్లు అయిపోయేమో కానీ.. ఇప్పుడు బూతల పర్వం మొదలైంది. అది కూడా బహిరంగంగానే. ఇందుకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు నోరు పారేసుకోవటమే నిదర్శనంగా చెప్పాలి.
తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రతి ***కు బీజేపీని భయపెట్టటం అలవాటుగా మారిందంటూ రాయలేని భాషలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చేతిలో పవర్ ఉంది కదా అని భయపెడితే తాము భయపడమన్న ఆయన.. టీడీపీతో పొత్తు కారణంగా బీజేపీకి గ్రహణం పట్టిందన్నారు. ప్రస్తుతం తమ పార్టీకి పట్టిన చంద్రగ్రహణం వీడిందన్న ఆయన.. పచ్చ నాయకులు బీజేపీ నేతల్ని బెదిరిస్తున్నారన్నారు.
అంతు చూస్తామంటూ తమ నేతలపై సోషల్ మీడియాలో భయపెడుతున్నారన్న ఆయన.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఐదు ప్రాజెక్టులకు రూ.12,572 కోట్ల పనులు జరుగుతాయని ఏపీ సర్కారుకు కేంద్రం లేఖ రాసిందన్నారు. కోట్ల రూపాయిల ఖర్చు చేసిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
అవినీతి విషయంలో ఏపీ.. తెలంగాణ రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయన్న మాట చెప్పటం ద్వారా రెండు రాష్ట్రాల్లోని చంద్రుళ్ల పాలన ఎలాంటిదో చెప్పేసినట్లైంది. టీడీపీ నేతలపై ఇంత తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న బీజేపీ నేతల ఆగ్రహం చూస్తే.. రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం మరోస్థాయికి చేరుతుందని చెప్పక తప్పదు.
తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రతి ***కు బీజేపీని భయపెట్టటం అలవాటుగా మారిందంటూ రాయలేని భాషలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చేతిలో పవర్ ఉంది కదా అని భయపెడితే తాము భయపడమన్న ఆయన.. టీడీపీతో పొత్తు కారణంగా బీజేపీకి గ్రహణం పట్టిందన్నారు. ప్రస్తుతం తమ పార్టీకి పట్టిన చంద్రగ్రహణం వీడిందన్న ఆయన.. పచ్చ నాయకులు బీజేపీ నేతల్ని బెదిరిస్తున్నారన్నారు.
అంతు చూస్తామంటూ తమ నేతలపై సోషల్ మీడియాలో భయపెడుతున్నారన్న ఆయన.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఐదు ప్రాజెక్టులకు రూ.12,572 కోట్ల పనులు జరుగుతాయని ఏపీ సర్కారుకు కేంద్రం లేఖ రాసిందన్నారు. కోట్ల రూపాయిల ఖర్చు చేసిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
ఓపక్క కేంద్రం ఇస్తున్న నిధులు తీసుకుంటూనే.. మరోవైపు అదే కేంద్రంపై దొంగ దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దొంగ దీక్షలు చేస్తున్న బాబు ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. రాష్ట్రానికి పోలవరం మోడీ ఇచ్చిన వరంగా ఆయన అభివర్ణించారు.