మాటలతో కెలకటం కూడా ఒక ఆర్టే. ఈ విషయంలో బీజేపీ నేతలకు.. కమ్యునిస్ట్ సోదరులు ప్రత్యేక కోర్సు చేసినట్లుగా కనిపిస్తుంటారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే.. కమలనాథులు.. కమ్యునిస్ట్ ల మధ్య జరిగే మాటల యుద్ధంలో ఒకరికి మించి మరొకరు మాటలతో చెలరేగిపోతుంటారు.
నువ్వెంత అంటే నువ్వెంత? అన్నట్లుగా సాగే మాటల యుద్ధంలో ఇరు వర్గాలు పోటాపోటీగా ఉంటాయి. ఇక.. ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే.. గులాబీ నాథుల కెలుకుడు ముందు మిగిలిన పార్టీలన్ని చేతులు ఎత్తేసే పరిస్థితి. అంతోఇంతో ఆ మాటల దాడిని కాస్త కాచుకునే పార్టీగా కమలనాథుల్ని చెప్పాలి. సంఘ్ పరివార్ ట్రైనింగ్ కానీ.. మొదట్నించి కమ్యునిస్ట్ లతో ఉండే లొల్లితో మాటల యుద్ధంలో కరకుగా ఉంటారని చెప్పాలి.
అలాంటి కమలనాథులకు నాటు మాటలతో ఇబ్బంది పెట్టే అలవాటు టీడీపీ నేతల సొంతంగా చెబుతారు. ఏపీ మీద ఫోకస్ పెట్టిన ఆ పార్టీ అ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తన చురుకైన మాటలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితి. చిన్న చిన్నగా.. ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా పాయింట్ టు పాయింట్ అన్నట్లుగా విమర్శలు చేయటం.. ఆరోపణలు సంధించటం.. అంకెల హడావుడితో ఏపీ సర్కారు ఏమీ చేయలేదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడటం అలవాటు.
జీవీఎల్ చేస్తున్న విమర్శలతో బాబు సర్కారు తరచూ ఆత్మరక్షణలో పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జూలు విదిలించిన తెలుగు తమ్ముళ్లు కమలనాథుల మీద ఎదురుదాడికి దిగారు. ఎవరేం చెప్పినా.. ప్రత్యేక హోదా విషయంలో మోడీ మాస్టారు ఇచ్చిన హ్యాండ్ తో ఆంధ్రోళ్లు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో.. బీజేపీ నేతల మీద తీవ్రస్థాయిలో విమర్శలు పెడుతున్న తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో బ్యాలెన్స్ తప్పు తున్నారు కూడా. తాజాగా ఇలాంటివి పరిస్థితి టీడీపీ నేత బుద్దా వెంకన్న విషయంలో చోటు చేసుకుంది. తమ అధినేతను అదే పనిగా విమర్శిస్తున్న జీవీఎల్ పై బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆ విమర్శలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. బుద్దా వెంకన్న పై కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ కు తాను ఫిర్యాదు చేశానన్నారు.
బుద్దా వెంకన్న కాల్ మనీ.. సెక్స్ రాకెట్ లలో సూత్రధారులని మండిపడ్డ జీవీఎల్.. తనకు ఆయన బహిరంగ క్షమాపణ చెబితే మాత్రమే తాను వదిలేస్తానన్నారు. ఏమైనా జీవీఎల్ లాంటి మాటల నేతను సైతం మంట పుట్టేలా చేసిన బుద్ధా వెంకన్న ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారని చెప్పాలి. మరి.. జీవీఎల్ ఆఫర్ కు బుద్దా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.