బీజేపీతో టీడీపీ క‌టీఫ్ ...హైక‌మాండ్ ఆదేశం?

Update: 2018-03-07 09:34 GMT
విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో కొద్ది రోజులుగా టీడీపీ - బీజేపీల మైత్రికి తెర‌ప‌డ‌బోతోంద‌న్న వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాల త‌ర‌హాలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ నిన్న ప్ర‌క‌టించ‌డంతో నేడో రేపో బీజేపీతో టీడీపీ తెగ‌దెంపులు చేసుకుంటుద‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఆ వార్త‌ల‌కు ఊత‌మిస్తూ...తాజాగా ఏపీలోని బీజేపీ మంత్రుల‌కు బీజేపీ హైక‌మాండ్ నుంచి ఆదేశాలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ‌, బీజేపీతో పొత్తును ఉపసంహరించుకుంటామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన ప‌క్షంలో.....బీజేపీ మంత్రులు వెంట‌నే రాజీనామా చేయాల‌ని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో రాజ‌కీయ‌ప‌రిణామాలు తీవ్ర ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్నాయి. కేంద్రంపై గుర్రుగా ఉన్న టీడీపీ....బీజేపీతో తెగ‌దెంపులు చేసుకునేందుకు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో....చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని బ‌ట్టి రాజీనామాల‌కు సిద్ధంగా ఉండాల‌ని బీజేపీ హైక‌మాండ్ త‌మ ఎంపీల‌కు ఆదేశాలు జారీచేసింద‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌కారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు - దేవాద‌య శాఖ మంత్రి మాణిక్యాల రావుకు బీజేపీ పెద్ద‌ల నుంచి ఫోన్లు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. ఆ ఫోన్లు వ‌చ్చిన వెంట‌నే అమరావతిలో బీజేపీ మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. మ‌రోవైపు,  ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబుకు బీజేపీ మంత్రులు ఫోన్ చేశారు. హైకమాండ్ నిర్ణ‌యం అదేన‌ని హ‌రిబాబు కూడా ధృవీక‌రించార‌ట‌. అవ‌స‌ర‌మైతే స్పీక‌ర్ ను స‌మ‌యం అడిగి వెంట‌నే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయ‌న బీజేపీ మంత్రుల‌కు సూచించార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News