ముందు టీడీపీనే తొక్కేయండన్న బీజేపీ హై కమాండ్?

Update: 2019-10-23 07:03 GMT
ఒకవైపు చంద్రబాబు నాయుడు మళ్లీ భారతీయ జనతా పార్టీని గోకడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. మోడీతో తనకు వ్యక్తిగత విబేధాలు లేవని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు. మొన్నటి  వరకూ మోడీని చంద్రబాబు నాయుడు ఎంతగా తిట్టారో అందరికీ తెలిసిందే. మోడీని మళ్లీ ప్రధానిని కానీయకూడదంటూ చంద్రబాబు నాయుడు చాలా హంగామానే చేశారు. అనేక రాష్ట్రాలకు తిరిగారు. వివిధ పార్టీల వాళ్లను కలిశారు.

అయితే చంద్రబాబు నాయుడు ప్రయత్నం సఫలం కాలేదు. ఏపీలో చంద్రబాబు నాయుడిపార్టీ చిత్తు అయ్యింది. ఇప్పుడు  ఆయన మరో యూటర్న్ తీసుకున్నారు. కేంద్రంతో విబేధించి నష్టపోయినట్టుగా ప్రకటించుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ ను తిట్టాలంటూ తన పార్టీ వాళ్లకు కూడా ఆదేశాలిచ్చాడట చంద్రబాబు నాయుడు.

ఇలా చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ తీసుకునే పనిలో ఉంటే.. బీజేపీ హై కమాండ్ మాత్రం చంద్రబాబు మీద కన్నేసిందట. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ వేసిన వేషాలను ఢిల్లీలోని కమలనాథులు మరిచిపోవడం లేదట. తమతో కలిసి ఉన్నంత సేపూ కలిసి ఉండి, ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు వేసిన వేషాలను కమలం పార్టీ హై కమాండ్ గట్టిగా పరిశీలిస్తోందని సమాచారం.

అందులో భాగంగా ఏపీలో భారతీయ జనతా పార్టీ వాళ్లకు ప్రత్యేక ఆదేశాలు కూడా వచ్చాయని సమాచారం. ముందుగా తెలుగుదేశం పార్టీని తొక్కాలని, ఆ పార్టీ నుంచి వచ్చే వారిని చేర్చుకోవాలని, తెలుగుదేశం పార్టీని దెబ్బతీసిన తర్వాతే మిగత సంగతి ఆలోచించాలని ఢిల్లీనుంచి బీజేపీ హై కమాండ్ గట్టిగా ఆదేశించిందని సమాచారం.

తెలుగుదేశం పార్టీని పూర్తిగా అణగదొక్కితేనే ఏపీలో బీజేపీ పుంజుకుంటుందని, లేకపోతే లేదని.. అందుకే ముందు టీడీపీని దెబ్బతీయాలని ఆదేశాలు వచ్చాయట. తెలుగుదేశం పార్టీని అణగదొక్కితే ఆ స్థానంలో బీజేపీ ఎదిగే అవకాశం ఉందనేది ఢిల్లీ పెద్దల విశ్లేషణ కూడానట!
Tags:    

Similar News