దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా యూపీ ప్రత్యేకత వేరు. డెబ్బై అయిదేళ్ల స్వాతంత్ర భారతంలో యూపీయే అధికార పీఠానికి దగ్గర దారి అని ఎపుడూ రుజువు అవుతూనే ఉంది. అలాంటి యూపీలో ఈసారి జరిగిన ఎన్నికల్లో ఎవరు విజేత అన్నదే నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
యూపీలో మళ్లీ బీజేపీ జెండా పాతుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. మెజారిటీ సర్వే సంస్థలు యూపీ బీజేపీదేనని చెప్పేశాయి. అయితే ఇలా చెప్పినవన్నీ కచ్చితంగా అరవై నుంచి వంద దాకా సీట్లను బీజేపీకి తగ్గించేశాయి. యూపీలో బీజేపీకి గత ఎన్నికల్లో 312 సీట్లు వస్తే ఈసారి 211 నుంచి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తమ జోతీష్యాన్ని మొదలెట్టాయి.
అంటే కధ అటు ఇటూ తిరిగినా బీజేపీకి బొటాబొటీ మెజారిటీ ఖాయమే అంటున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూసినా ఎస్పీకి రెండు వందల సీట్లను మాత్రం ఇవ్వకపోవడం కమలనాధులకు భారీ ఊరట. మరో వైపు చూస్తే కాంగ్రెస్ కి యూపీలో దారుణమైన ఫలితాలు వస్తున్నాయని తేల్చాయి.
అలాగే బీఎస్పీ కధ కూడా ఏమీ బాగులేదని స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి అయిదు రాష్ట్రాల ఎన్నికలలో అందరికీ ఆసక్తిని రేపేది ఒక్క యూపీ మాత్రమే. అక్కడ కనుక బీజేపీ మళ్ళీ అధికారం చేపడితే ఈ ఫ్రంటులూ , పొలిటికల్ స్టంటులూ అన్నీ కూడా కొంతకాలం అయినా గప్ చిప్ అయిపోతాయని అంటున్నారు.