2019లో కొత్త మిత్రులే మోడీని ఆదుకుంటార‌ట‌!

Update: 2018-08-15 05:31 GMT
దేశానికి ఎన్నిక‌ల మూడ్ వ‌చ్చేసింది. ప్ర‌జ‌లు త‌మ‌కిచ్చిన ప‌ద‌వీకాలంలో ఒక్క‌రోజును కూడా వ‌దులుకోమ‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా బ‌ల్ల గుద్ది మ‌రీ బ‌లంగా చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఆ ర‌కంగా చూస్తే.. దాదాపు ఎన్నిక‌ల‌కు ఎనిమిది నెల‌ల‌కు పైనే గ‌డువుంది. కానీ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేడి అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇలాంటి వేళ‌.. ప‌లు మీడియా సంస్థ‌లు త‌మ స‌ర్వేలంటూ వివ‌రాల్ని వెల్ల‌డిస్తున్నాయి.

తాజాగా వార్ రూం స్ట్రాట‌జీస్ అండ్ ఊటోపియా అనే సంస్థ త‌మ స‌ర్వే వివ‌రాల్ని వెల్ల‌డించింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీని క‌చ్ఛితంగా ఓడిస్తామ‌ని కాంగ్రెస్ న‌మ్మ‌కంగా చెబుతున్న వేళ‌.. ఆ పార్టీకి వ‌చ్చే సీట్లు వంద సంగ‌తి త‌ర్వాత 80 అంకెను కూడా ట‌చ్ చేయ‌వ‌న్న విష‌యాన్ని తేల్చేయ‌టం విశేషం.

అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి బీజేపీకి అవ‌స‌ర‌మైన సీట్ల సంఖ్య 50 సీట్ల దూరంలో ఆగిపోతుంద‌న్న మాట‌ను తాజా స‌ర్వే తేల్చింది. కాంగ్రెస్  కు 78 సీట్లు.. బీజేపీకి 227 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయంది.  అదే స‌మ‌యంలో ఇత‌ర పార్టీల‌న్నింటికి క‌లిపి 238 సీట్లు వ‌చ్చే వీలుంద‌న్న అంచ‌నా వేసింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. బిహార్.. గుజ‌రాత్.. రాజ‌స్థాన్ ల‌లో బీజేపీ దెబ్బ తిన‌టం.. ఆయా రాష్ట్రాల్లో ఇత‌ర పార్టీలు కోలుకోవ‌టంతో బీజేపీ మేజిక్ ఫిగ‌ర్ కు దూరంగా నిలుస్తుంద‌ని అంచ‌నా వేశారు. అయితే.. కొత్త మిత్రుల‌తో క‌లిసి బీజేపీ కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే వీలు ఉంటుంద‌ని చెబుతున్నారు.

మ‌రో మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో జ‌రిగే మూడు రాష్ట్రాల (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్థాన్‌.. ఛ‌త్తీస్ గ‌డ్‌)   అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  బీజేపీ అధికారాన్ని చేజార్చుకుంటుంద‌న్న స‌ర్వే రిపోర్టులు వ‌స్తున్న వేళ‌.. తాజా స‌ర్వే విడుద‌ల కావ‌టం గ‌మ‌నార్హం. ఒక‌వేళ‌.. ఈ స‌ర్వే కానీ నిజ‌మైతే.. 2019 త‌ర్వాత కేంద్రంలో ఏర్పాటు అయ్యే బీజేపీ స‌ర్కారుకు మిత్రులు చుక్క‌లు చూపించ‌టం ఖాయం. త‌మ‌కొచ్చిన మెజార్టీ బ‌లంతో మిత్రుల‌ను లైట్ తీసుకున్న బీజేపీకి.. కొత్త త‌ర‌హా సినిమా క‌నిపించ‌టం ప‌క్కా అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


Tags:    

Similar News