ఢిల్లీలోని ఆమ్ ఆద్మీపార్టీ సర్కారు లిక్కర్ స్కాంకు పాల్పడిందని.. నూతనమద్యం విధానంలో అవకతవకల కు పాల్పడి.. కోట్ల రూపాయలు దోచుకుందని.. బీజేపీ మండిపడుతున్న విషయం తెలిసిందే. అదేసమయం లో ఈ వ్యవహారంపై.. సీబీఐ.. ఈడీ కూడా దృష్టి పెట్టడం.. ఒకే రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఇల్లు సహా.. ఆయన అనుచరులు.. మరికొందరి ఇళ్లపై మొత్తంగా 31 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించి న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా ఈ వ్యవహారం.. దేశరాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
ఈ క్రమంలోనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా.. సీఎం కేజ్రీవాల్‌లు.. బీజేపీపై నిప్పులు చెరుగుతున్నా రు. ఇవన్నీ ఉత్తుత్తి కేసులని.. రాజకీయంగా తమపై పైచేయి సాధించేందుకు నరేంద్ర మోడీ ఆడుతున్న పొలిటికల్ గేమ్ అని.. వారిరువురూ.. వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. తమను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి బీజేపీ నుంచి కూడా అంతే రియాక్షన్ వచ్చింది. ఎవరు కొనుగోలు చేస్తామని చెప్పారో.. చెప్పాలని నిలదీసింది.
ఇలా.. అటు ఆప్.. ఇటు బీజేపీల మధ్య జరుగుతున్న ఈ వివాదంలో అనూహ్యంగా.. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు.. అన్నాహజారే జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన కేజ్రీవాల్‌పై నిప్పులు చెరిగారు. కేజ్రీవాల్ అధికార వ్యసనంలో మునిగిపోయారంటూ విమర్శించారు. ఎక్సైజ్ పాలసీని పరిశీలిస్తే మద్యం అమ్మకాలతో పాటు అవినీతిని ప్రోత్సహించేలా ఉందన్నారు. ప్రజల జీవితాన్ని నాశనం చేయడంతో పాటు మహిళలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదముందని పేర్కొన్నారు.
అంతేకాదు.. ఢిల్లీ మద్యం కుంభకోణంపై వస్తున్న వార్తలను చూస్తుంటే తనకు బాధగా ఉందని చెప్పారు. అందుకే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా లేఖ రాశానని తెలిపారు. "ప్రతి వార్డులోను ఆయన ఓ లిక్కర్ షాపును ప్రారంభించారు. వయసు పరిమితిని 25 ఏళ్ల నుంచి 21కు తగ్గించి.. మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అందుకే తొలిసారిగా ఆయనకు లేఖ రాశాను. నేను ఉద్యమిస్తున్నపుడు.. ఆయన నన్ను 'గురు' అని పిలిచేవారు. ఆ విషయాలు గుర్తున్నాయా ఇప్పుడు?" అని అన్నా సూటిగా ప్రశ్నించారు.
కేజ్రీ వాల్ భారీ కౌంటర్! అన్నా హజారే చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో స్పందించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపిస్తుంటే.. సీబీఐ మాత్రం అలాంటిదేమి జరగలేదని చెబుతోందన్నారు. ప్రజలు వీటిని వినడం లేదని.. అందుకే తాజాగా అన్నా హజారే భుజాలపై తుపాకీ పెట్టి.. తమపై గురి పెడుతున్నారని విమర్శించారు. తాము ప్రజాక్షేత్రంలోకి వచ్చినపుడే.. ఎలాంటి విచారణలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడే వస్తామన్నారు.
సీబీఐ.. మనీశ్ సిసోడియాను 14 గంటల పాటు విచారించిందని.. వారడిగిన అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారని తెలిపారు. ఆయన లాకర్లో ఏం లభించలేదని.. సీబీఐ అనధికారంగా క్లీన్చిట్ ఇచ్చిందన్నారు. మొత్తంగా చూస్తే.. అటు గురువు... ఇటు శిష్యుల మధ్య మద్యం పాలసీ విధానం మంటలు రేపడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.