కేంద్రంలోని బీజేపీతో తెలంగాణ సారథి, టీఆర్ ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారని.. కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ.. రేవంత్ దీనికి సంబంధించి తాజాగా భారీ బాంబునే పేల్చారు. ఎక్కడ ఎప్పుడు అవకాశం వచ్చినా.. కేసీఆర్‌పై విరుచుకుపడుతున్న రేవంత్.. తాజాగా మరోసారి తన దూకుడు మరింత పెంచారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. త్వరలో జరగనున్న.. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ పరిశీలకుడుగా హోం శాఖ సహాయ మంత్రి, హైదరాబాద్కు చెందిన కిషన్ రెడ్డిని కేంద్రం నియమించిన విషయం తెలిసిందే.
అయితే.. ఈ నియామకం వెనుక కేసీఆర్ సూచనలు, సలహాలు.. ఒప్పందం ఉన్నాయని రేవంత్ ప్రకటించడం సంచలనంగా మారింది. అంతేకాదు.. కేసీఆర్ గత ఢిల్లీ పర్యటనలో బీజేపీకి సహకరిస్తానని ప్రధాని మోడీతో ఒప్పందం కుదుర్చుకున్నారని రేవంత్ సంచలన విమర్శలు చేశారు.
తెలంగాణ నుంచి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నిధులు సమకూర్చేందుకు కూడా కేసీఆర్ రెడీ అయ్యారని, ఈ ఒప్పందం దానిలో భాగమేనని రేవంత్ చెప్పడం.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేసీఆర్ సహకారంతో తమిళనాడు బీజేపీ ఎన్నికలకు వెళ్తోందని ఆయన అన్నారు. అందుకే ఎన్నికల బాధ్యుడిగా కిషన్‌ను నియమించారని సంచలన ఆరోపణ చేశారు.
అక్కడితో కూడా ఆగని.. రేవంత్.. తెలంగాణకు చెందిన, ముఖ్యంగా కేసీఆర్ కనుసన్నల్లో నడిచే.. ఇంటిలిజెన్స్ అదికారులను కూడా తమిళనాడుకు పంపుతున్నారని, వారి ద్వారా కూడా బీజేపీకి సాయం చేస్తున్నారని రేవంత్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ నిఘా అధికారులను తమిళనాడులో పెట్టారన్న అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, ఎంపీ అరవింద్ ఆటలో అరటిపండు లాంటివారని దుయ్యబట్టారు. మోడీ - కేసీఆర్ మధ్య దోస్తీ ఉందనే కేసులు బయటికి రావడం లేదని రేవంత్ ఆరోపించారు. మొత్తంగా చూస్తే.. రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో బాంబులు పేల్చాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ వ్యాఖ్యలపై అధికార టీఆర్ ఎస్ స్పందిస్తూ.. మౌనం పాటిస్తుందా చూడాలి.