తెలివితేటలు ఉంటే ఫర్లేదు. కానీ.. చావు తెలివితేటలతోనే ఇబ్బంది అంతా. అలాంటివి ప్రయోగించి అడ్డంగా బుక్ కావటమే కాదు.. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన తెలంగాణ బీజేపీ నేత భరత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
గడిచిన కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో భరత్ రెడ్డి ఆరాచకాలు వీడియోల రూపంలో దర్శనమివ్వటం తెలిసిందే. తనకున్న పేరు.. పలుకుబడులతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే భరత్ రెడ్డి తనను ఎవరూ ఏమీ చేయలేరన్నట్లుగా వ్యవహరిస్తారని చెబుతారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలానికి చెందిన భరత్ రెడ్డి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారన్న ఆరోపణ ఉంది.
ఇటీవల భరత్ రెడ్డి తప్పుల్ని ఎత్తి చూపి.. నిలదీసిన ఇద్దరిని దారుణమైన శిక్షలకు గురి చేసిన వైనం వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అభంగపట్నానికి చెందిన భరత్ రెడ్డి తప్పులను గ్రామానికి చెందిన లక్ష్మణ్.. రాజేశ్వర్ లు ఎత్తిచూపారు. దీనికి సీరియస్ అయిన భరత్ రెడ్డి దారుణమైన బూతులు తిడుతూ వారిపై దాడి చేయటం.. చేతిలో కర్రతో బడిపిల్లల్ని బాదిన వైనం వీడియోల రూపంలో బయటకు వచ్చింది.
భరత్ రెడ్డి ఆరాచకాలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ కావటం సంచలనమైంది. భరత్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలన్న ఒత్తిడి పెరిగింది. మీడియాలో ప్రముఖంగా భరత్ రెడ్డి వార్త వచ్చిన వేళ.. ఊహించని ట్విస్ట్ తో మరింత మంది దృష్టికి వెళ్లింది.
దొరల రాజ్యం సినిమా షూటింగ్ లో భాగంగానే ఇదంతా జరిగిందని.. వైరల్ అయిన వీడియో ఉన్నది షూటింగ్ లో భాగమని చెప్పుకోవటం ఒకఎత్తు అయితే.. ఆ వీడియోలో ఉన్న ఇద్దరి చేత ఇవే మాటలు చెప్పటంతో కొంత అయోమయం చోటు చేసుకుంది. అయితే.. తమ గ్రామానికి చేరుకున్న లక్ష్మణ్.. రాజేశ్వర్ లు అసలు విషయాన్ని బయటపెట్టారు. భరత్ రెడ్డి చెబుతున్నదంతా అబద్ధమని.. షూటింగ్ మాట బూటకమని.. తాను చెప్పినట్లుగా మీడియా ముందు చెప్పకపోతే ప్రాణాలు తీస్తానని బెదిరించటంతో ఒప్పుకొని తప్పు చెప్పినట్లుగా వెల్లడించారు.
దీంతో.. భరత్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలన్న డిమాండ్ మరింత పెరిగింది. ఇదే సమయంలో భరత్ రెడ్డిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయటంతోపాటు కిడ్నాప్ కేసును పోలీసులు నమోదు చేశారు. వీడియో బయటకు వచ్చిన తర్వాత ఉన్నట్లుండి అదృశ్యమైన భరత్ రెడ్డిని తాజాగా హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. భరత్ రెడ్డి అరెస్ట్ పై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తాము అదుపులోకి తీసుకున్నట్లుగాకన్ఫర్మ్ చేయలేదు.