పేరుకు ఆయన ఎమ్మెల్యేనే కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రికి వియ్యంకుడు... భవిష్యత్ నేత లోకేశ్ కు స్వయాన మామగారు, మేనమామ కూడా కావడంతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు టీడీపీలో మంచి ప్రాధాన్యం ఉంది. అంతేకాదు... టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుత్రరత్నం కావడంతో పాతతరం నేతలూ బాలయ్యను గౌరవిస్తారు. ఎన్టీఆర్ నేపథ్యం కంటే లోకేశ్ కు మామగారిగానే ఇప్పుడు బాలయ్య మరింత గౌరవం అందుకుంటున్నారు. లోకేశ్ పార్టీలో చంద్రబాబు తరువాత సెకండ్ ప్లేసులో ఉండడం.. పార్టీకి ఆయన భవిష్యత్తు నేత కావడంతో టీడీపీ నేతలంతా లోకేశ్ కు ఎంతో విధేయంగా ఉంటున్నారు. ఆ విధేయత, లోకేశ్ కు పిల్లనిచ్చిన బాలకృష్ణపట్లా చూపిస్తున్నారు. తాజాగా నాలుగు రోజుల కిందట బాలకృష్ణ సెక్రటేరియట్ కు రాగా అక్కడున్న బీజేపీ మంత్రి ఒకరు బాలయ్యకు వంగివంగి దండాలు పెట్టి ఆయన వచ్చిన పనేంటో కనుక్కుని ఆయన వెన్నంటే ఉండి సేవలు చేశారట.
ఎమ్మెల్యే బాలకృష్ణ మొన్న ఏపీ సచివాలయానికి వెళ్లారు. తన నియెజక వర్గంలో ఓ కార్యక్రమ నిర్వహణపై సంబంధిత మంత్రితో చర్చించేందుకు ఆయన అక్కడకు వెళ్లారు. బాలయ్య రాకను గమనించి అక్కడున్న మంత్రులంతా వంగి వంగి దండాలు పెట్టారు. మిత్ర పక్ష హోదాలో రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న ఓ బీజేపీ నేత ఈ విషయంలో అందరినీ మించిపోయారట. బాలయ్యకు అతిథి మర్యాదలు చేశారట.
సదరు బీజేపీ మంత్రిగారి ''అతి"థి మర్యాదలకు కారణాలున్నాయని ఏపీ మంత్రివర్గంలోని ఆయన సహచరులు గుసగుసలాడుకుంటున్నారు. చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేస్తే ఆయన స్థానానికి ఎసరొస్తుందన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కొద్దికాలంగా ఆయన సైలెంటుగా ఉంటున్నారు. అయితే తెర వెనుక మాత్రం ఎలాగైనా మంత్రివర్గంలో కొనసాగేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారట. అందులో భాగంగా అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భావించి బాలయ్య, లోకేశ్ ద్వారా చంద్రబాబు వద్ద తన పదవి కొనసాగింపు విషయం ఎలాగైనా సెటిల్ చేసుకోవాలన్న ప్రయత్నంలోనే బాలయ్యను ప్రసన్నం చేసుకున్నారని చెబుతున్నారు